ఈ సంపుటంలో ముప్పయి కార్గిల్ యుద్ధకథలున్నాయి. ఆ యుద్ధంలో కనుమూసిన మహావీరులందరూ చారిత్రిక నక్షత్ర మండలంలో స్థిరవాసులయ్యారు. కాని యుద్ధం ముగిసిన తరువాత క్షేమంగా తిరిగివచ్చిన కొందరు సైనికులు, వచ్చే పెన్షను చాలక, ప్రాపంచిక సాధా'రణ' రంగంలో జీవన సమరం సాగించే నేర్పు బాగా అలవడక ఆర్థికంగాను, మానసికంగాను ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. "ఇటీవల చనిపోయిన, అనేక పతకాల విజేత అయిన ఒక వీరసైనికుడి అంత్యక్రియలను ఆయన కొడుకులు చందాలు వసూలు చేసి పూర్తిచేయడం ప్రముఖంగా టీవిలో చూపారు. ఇదేనా వీరసైనికులకు దేశప్రజల నివాళి?" అని ప్రశ్నిస్తారు రచయిత, చివరి కథలో. అలా ఒకొక్క కథలో ఒక్కో విషయాన్ని గురించి రచయిత చాలా బాగా తెలియజేశారు.
ఈ సంపుటంలో ముప్పయి కార్గిల్ యుద్ధకథలున్నాయి. ఆ యుద్ధంలో కనుమూసిన మహావీరులందరూ చారిత్రిక నక్షత్ర మండలంలో స్థిరవాసులయ్యారు. కాని యుద్ధం ముగిసిన తరువాత క్షేమంగా తిరిగివచ్చిన కొందరు సైనికులు, వచ్చే పెన్షను చాలక, ప్రాపంచిక సాధా'రణ' రంగంలో జీవన సమరం సాగించే నేర్పు బాగా అలవడక ఆర్థికంగాను, మానసికంగాను ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. "ఇటీవల చనిపోయిన, అనేక పతకాల విజేత అయిన ఒక వీరసైనికుడి అంత్యక్రియలను ఆయన కొడుకులు చందాలు వసూలు చేసి పూర్తిచేయడం ప్రముఖంగా టీవిలో చూపారు. ఇదేనా వీరసైనికులకు దేశప్రజల నివాళి?" అని ప్రశ్నిస్తారు రచయిత, చివరి కథలో. అలా ఒకొక్క కథలో ఒక్కో విషయాన్ని గురించి రచయిత చాలా బాగా తెలియజేశారు.© 2017,www.logili.com All Rights Reserved.