రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఉన్న మెహందీపూర్ అనే ఒక చిన్న స్థాయి పట్టణంలో మహాద్భుతమైన ఒక హనుమాన్ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో హనుమంతుడి యొక్క బాలరూపం పూజలందుకుంటున్నది. ఆ కారణంగానే ఈ ఆలయంలోని హనుమాన్ని "బాలాజీ" అని పిలుస్తారు. (నోట్ : దక్షిణ భారతదేశంలోని తిరుమల కొండపై వెలసిన శ్రీనివాసుడిని కూడా "బాలాజీ” అని పిలుస్తారు. కనుక, తిరుమలలోని బాలాజీ మరియు మెహందీపూర్ లోని బాలాజీ ఒకరు కాదని గుర్తించాలి.)
కరాలి మరియు దౌసా జిల్లాల సరిహద్దులో ఈ మెహందీపూర్ గ్రామం ఉన్నది. ఒక విశేషం ఏమంటే, ఈ ఆలయంలో సగభాగం - ఒక జిల్లా సరిహద్దులో ఉండగా, సగ భాగం - ఇంకొక జిల్లా సరిహద్దులో ఉన్నది. రెండు పర్వతాల మధ్య పొందికగా ఇమిడి ఉన్న మెహందీపూర్ గ్రామంలోని ఒక పర్వతంపైన కొన్ని శతాబ్దాల క్రితం బాలహనుమంతుడు (బాలాజీ) స్వయంభుగా అవతరించాడు. గతంలో దట్టమైన అరణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలోని ఈ పర్వతంపైన క్రీ.శ. 9వ శతాబ్దంలో గణేష్పురి అనే ఒక పూజారి, మొదటిసారిగా బాలాజీ ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఈ ప్రాంతం అంతా ఒక గ్రామంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం - రాజపుత్ర వాస్తు శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయ పరిసరాలు అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతోనూ మరియు ఏదో తెలియని భయాన్ని కలిగించే వాతావరణంతోను నిండి ఉంటాయి.
ఈ బాలాజీ ఆలయంలో ప్రధాన దైవం అయిన బాలాజీ విగ్రహం ఒక రాయిలో ఏర్పడింది. 'స్వయంభు'గా అవతరించిన ఈ బాలాజీ విగ్రహం లేదా రూపం యొక్క ఎడమ ఛాతీ మీద ఉన్న ఒక రంధ్రం నుండి నిరంతరమూ జలం స్రవిస్తూ ఉంటుంది. విగ్రహానికి సాంప్రదాయయుక్తంగా వస్త్రములు ధరింపచేసిన తరువాత కూడా ఈ జలధార ఆగదు. నిర్విరామంగా స్రవించే ఈ జలం ఈ విగ్రహ పాదాల వద్ద ఒక చిన్న సరస్సులాగా ఏర్పడింది..................
పిశాచ బాధలను నిర్మూలించే 'మెహందీపూర్ బాలాజీ' మందిర మర్మం? రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో ఉన్న మెహందీపూర్ అనే ఒక చిన్న స్థాయి పట్టణంలో మహాద్భుతమైన ఒక హనుమాన్ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో హనుమంతుడి యొక్క బాలరూపం పూజలందుకుంటున్నది. ఆ కారణంగానే ఈ ఆలయంలోని హనుమాన్ని "బాలాజీ" అని పిలుస్తారు. (నోట్ : దక్షిణ భారతదేశంలోని తిరుమల కొండపై వెలసిన శ్రీనివాసుడిని కూడా "బాలాజీ” అని పిలుస్తారు. కనుక, తిరుమలలోని బాలాజీ మరియు మెహందీపూర్ లోని బాలాజీ ఒకరు కాదని గుర్తించాలి.) కరాలి మరియు దౌసా జిల్లాల సరిహద్దులో ఈ మెహందీపూర్ గ్రామం ఉన్నది. ఒక విశేషం ఏమంటే, ఈ ఆలయంలో సగభాగం - ఒక జిల్లా సరిహద్దులో ఉండగా, సగ భాగం - ఇంకొక జిల్లా సరిహద్దులో ఉన్నది. రెండు పర్వతాల మధ్య పొందికగా ఇమిడి ఉన్న మెహందీపూర్ గ్రామంలోని ఒక పర్వతంపైన కొన్ని శతాబ్దాల క్రితం బాలహనుమంతుడు (బాలాజీ) స్వయంభుగా అవతరించాడు. గతంలో దట్టమైన అరణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలోని ఈ పర్వతంపైన క్రీ.శ. 9వ శతాబ్దంలో గణేష్పురి అనే ఒక పూజారి, మొదటిసారిగా బాలాజీ ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఈ ప్రాంతం అంతా ఒక గ్రామంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం - రాజపుత్ర వాస్తు శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయ పరిసరాలు అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతోనూ మరియు ఏదో తెలియని భయాన్ని కలిగించే వాతావరణంతోను నిండి ఉంటాయి. ఈ బాలాజీ ఆలయంలో ప్రధాన దైవం అయిన బాలాజీ విగ్రహం ఒక రాయిలో ఏర్పడింది. 'స్వయంభు'గా అవతరించిన ఈ బాలాజీ విగ్రహం లేదా రూపం యొక్క ఎడమ ఛాతీ మీద ఉన్న ఒక రంధ్రం నుండి నిరంతరమూ జలం స్రవిస్తూ ఉంటుంది. విగ్రహానికి సాంప్రదాయయుక్తంగా వస్త్రములు ధరింపచేసిన తరువాత కూడా ఈ జలధార ఆగదు. నిర్విరామంగా స్రవించే ఈ జలం ఈ విగ్రహ పాదాల వద్ద ఒక చిన్న సరస్సులాగా ఏర్పడింది..................© 2017,www.logili.com All Rights Reserved.