'లెనిన్' అనేది నిజానికి ఆయన అసలు పేరు కాదు, అది ఆయన కలంపేరు మాత్రమే! తల్లిదండ్రులు పెట్టిన పేరు 'వ్లదీమిర్" అని మాత్రమే. రష్యన్లకు మూడు పేర్లుంటాయి. మొదటిది ఆ వ్యక్తిపేరు. రెండోది తండ్రిపేరు. మూడోది ఇంటిపేరు. ఆయన పూర్తిపేరు 'వ్లదీమిర్ ఇల్యీచ్ ఉల్యానోవ్' అనేది. ఇందులో మొదటిపేరు 'నదీమిర్' ఆయన పేరుకాగా, రెండో పేరైన 'ఇల్యీచ్'లోని ఇల్యా' అనేది తండ్రిపేరు. ఇక మూడోదైన 'ఉల్యానోవ్' అనేది. ఆయన ఇంటిపేరు. ఇదంతా కలిపి ఆయన పూర్తిపేరు అయిందన్నమాట. మరి ఈ 'లెనిన్' అన్న పేరు ఆయన రహస్య జీవితంలో పెట్టుకున్న కలం పేరు. దాంతో కలిపి ఆయన పేరు 'వ్లదీమిర్ ఇల్యీచ్ లెనిన్" అయింది. ఈ పేరే తర్వాత స్థిరపడి, ప్రసిద్ధి కెక్కడం తెలిసిందే. ఆయన తనపేరు 'లెనిన్'గా పెట్టుకునేంత వరకూ, ఈ పుస్తకంలో ఆయన్ను అసలు పేరయిన 'ప్లదీమిర్' గానే పేర్కొనడం జరుగుతుంది. వ్లదీమిర్ యొక్క ముద్దుపేరు. "వొలోద్య". ఇక ప్రస్తుతం ఆయన బాల్యం గురించి తెలుసుకునేముందు, ఆయన తల్లిదండ్రులు గురించి, ఇతర కుటుంబ సభ్యుల గురించీ కొంత వివరంగా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే వారి ఆలోచనలూ, భావాలూ, ఆయన ఆలోచనలపై మాత్రమేగాక, ఆయన రాజకీయ కార్యాచరణపై కూడా ఎంతో ప్రభావాన్ని నెరిపాయి.
ఫ్లదీమిర్ తల్లిదండ్రులువ్లదీమిర్ తండ్రి ఇల్యా నికొలయెలిచ్ ఉల్యానోవ్. ఆయన 'ఆగ్రహన్' పట్టణంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబం తలపన్ను (Poll Tax) కట్టే శ్రేణికి చెందినదైనా, పేద పరిస్థితుల్లో ఉండేది. ఇల్యా తన 7వ ఏటనే తండ్రిని కోల్పోయాడు. ఇల్యాతోపాటు, తల్లీ, తమ్ముడూ, ఇద్దరు చెల్లెళ్లూ- ఈ అయిదుగురినీ పోషించే బాధ్యత...............
మొదటి అధ్యాయం విద్యార్థిగా 'లెనిన్' అనేది నిజానికి ఆయన అసలు పేరు కాదు, అది ఆయన కలంపేరు మాత్రమే! తల్లిదండ్రులు పెట్టిన పేరు 'వ్లదీమిర్" అని మాత్రమే. రష్యన్లకు మూడు పేర్లుంటాయి. మొదటిది ఆ వ్యక్తిపేరు. రెండోది తండ్రిపేరు. మూడోది ఇంటిపేరు. ఆయన పూర్తిపేరు 'వ్లదీమిర్ ఇల్యీచ్ ఉల్యానోవ్' అనేది. ఇందులో మొదటిపేరు 'నదీమిర్' ఆయన పేరుకాగా, రెండో పేరైన 'ఇల్యీచ్'లోని ఇల్యా' అనేది తండ్రిపేరు. ఇక మూడోదైన 'ఉల్యానోవ్' అనేది. ఆయన ఇంటిపేరు. ఇదంతా కలిపి ఆయన పూర్తిపేరు అయిందన్నమాట. మరి ఈ 'లెనిన్' అన్న పేరు ఆయన రహస్య జీవితంలో పెట్టుకున్న కలం పేరు. దాంతో కలిపి ఆయన పేరు 'వ్లదీమిర్ ఇల్యీచ్ లెనిన్" అయింది. ఈ పేరే తర్వాత స్థిరపడి, ప్రసిద్ధి కెక్కడం తెలిసిందే. ఆయన తనపేరు 'లెనిన్'గా పెట్టుకునేంత వరకూ, ఈ పుస్తకంలో ఆయన్ను అసలు పేరయిన 'ప్లదీమిర్' గానే పేర్కొనడం జరుగుతుంది. వ్లదీమిర్ యొక్క ముద్దుపేరు. "వొలోద్య". ఇక ప్రస్తుతం ఆయన బాల్యం గురించి తెలుసుకునేముందు, ఆయన తల్లిదండ్రులు గురించి, ఇతర కుటుంబ సభ్యుల గురించీ కొంత వివరంగా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే వారి ఆలోచనలూ, భావాలూ, ఆయన ఆలోచనలపై మాత్రమేగాక, ఆయన రాజకీయ కార్యాచరణపై కూడా ఎంతో ప్రభావాన్ని నెరిపాయి. ఫ్లదీమిర్ తల్లిదండ్రులు వ్లదీమిర్ తండ్రి ఇల్యా నికొలయెలిచ్ ఉల్యానోవ్. ఆయన 'ఆగ్రహన్' పట్టణంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబం తలపన్ను (Poll Tax) కట్టే శ్రేణికి చెందినదైనా, పేద పరిస్థితుల్లో ఉండేది. ఇల్యా తన 7వ ఏటనే తండ్రిని కోల్పోయాడు. ఇల్యాతోపాటు, తల్లీ, తమ్ముడూ, ఇద్దరు చెల్లెళ్లూ- ఈ అయిదుగురినీ పోషించే బాధ్యత...............© 2017,www.logili.com All Rights Reserved.