శ్రీమతి జి. ఎస్. లక్ష్మి గారి 'ఒక ఇల్లాలి కథ' నవల స్వతంత్రం రాకముందు అంటే 1935, 40 ప్రాంతాల సామాజిక స్థితిగతులు ఎలా వుండేవో చెపుతూ, ఆనాటి మధ్యతరగతి ఇల్లాళ్ల సంసార స్థితిగతులని చక్కగా చిత్రించారు.
ఓ ఎనభై సంవత్సరాల క్రితం స్త్రీల పరిధి వంటిల్లు, ఇల్లాలి పరిథి సంసారం. చాకిరి... చాకిరి...అత్తవారింట్లో, ఉమ్మడి సంసారాల్లో అవిశ్రాంతంగా వంచిన నడుం ఎత్తకుండా వంటింట్లో పడి చాకిరి చేయడం తప్ప తమకి ఒక వ్యక్తిగత జీవితం అన్నది లేకుండా, తన ఉనికి మరిచిపోయిన ఇల్లాళ్ల బతుకులు ఎలా వుండేవో చాలా సహజంగా, సరళంగా మొదలు పెట్టిన దగ్గిర నుంచి చదివించే రచనతో పాఠకులని ఆకట్టుకుంటుంది. అద్భుతమైన మలుపులు, ఉత్కంఠని రేకెత్తించే సంఘటనలు లేకుండా అతి సహజ రీతిలో మన అమ్మమ్మల, అమ్మల పాట్లు కాగితం మీద చూస్తున్నట్టు అనిపించే రీతిలో కథనం వుంది.
- జి. యస్. లక్ష్మి