దు:ఖాన్ని ఉపశమించటం కోసం రచన చేస్తున్న
అనుభూతి కవి!
ఒక కవిని చదవంగానే అతని కాలమూ తెలుస్తుంది. అతని కలమూ ఎవరివైపు ఉన్నదో కూడా తెలుస్తుంది. గంగిరెడ్డి అశ్వరరెడ్డి ప్రజాకవి అని అతని రాతలు ప్రతి పాద పాదాన నిరూపిస్తున్నాయి. అతనిలోని అలజడి అతన్ని ఒక కవిగా మన ముందుకి తెస్తున్నది. రాజీలేని రచయితగా అతని ఆందోళన ప్రతి కవితా నిరూపిస్తున్నది. కవిత్వ ఆవరణంలోకి ప్రవేశించాక ఎప్పుడు ఏకవి ఓ గొప్ప కవితతో మన ముందుకి ప్రత్యక్షమవుతాడో ఖచ్చితంగా చెప్పలేము. కవిత్వకళ నేర్చుకున్నాక తపస్సు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అశ్వరరెడ్డి అక్షరయాత్ర చేస్తున్నాడు. సాహిత్యయాత్ర నిర్విరామంగా చేస్తున్నాడు.
కవికి ఎన్నో దీక్షలు కావాల్సి వస్తుంది. ఆ దక్షయజ్ఞంలో కవి ఎవడ్నీ లెక్కచేయడు. నీవు ఎవడైతేం నాకేమిటి అనే ఎదిరింపుతోనే గడుసరితనమూ ముందుకి వస్తుంది. ఆ యాతనతోనే అశ్వరరెడ్డి తన కవిత్వపుస్తకంతో మన ముందుకు వస్తున్నాడు. అతనిలో తెగింపు ఉంది. అది బరితెగింపు కాదు. ఒక తల్లి బిడ్డని కనడానికి పడే పురిటి నొప్పులు, ప్రతి కవి పడినట్టుగానే అశ్వర రెడ్డి ప్రసూతితో ప్రతిక్షణం కవిత్వం వెలువరిస్తున్నాడు. అది చాలా కష్టతరమైన అనుభవం. తప్పదు. ప్రతి కవికీ ఇది అనుభవైకవేద్యం. అశ్వరరెడ్డి ప్రతి కవితలోనూ తానుగా కనిపిస్తున్నాడు. ప్రత్యక్షమవుతున్నాడు. ఈ లక్షణం ఆధునిక కవుల్లో లోపిస్తున్నది. ఏదో ఒక రాజకీయ తాపడంతో పూనకంతో కవిత్వం రాస్తున్నారే తప్ప విషయం ఉండటం లేదు. ఆ విషపూరిత లక్షణాలు అశ్వర్ధరెడ్డిలో.............
దు:ఖాన్ని ఉపశమించటం కోసం రచన చేస్తున్న అనుభూతి కవి!ఒక కవిని చదవంగానే అతని కాలమూ తెలుస్తుంది. అతని కలమూ ఎవరివైపు ఉన్నదో కూడా తెలుస్తుంది. గంగిరెడ్డి అశ్వరరెడ్డి ప్రజాకవి అని అతని రాతలు ప్రతి పాద పాదాన నిరూపిస్తున్నాయి. అతనిలోని అలజడి అతన్ని ఒక కవిగా మన ముందుకి తెస్తున్నది. రాజీలేని రచయితగా అతని ఆందోళన ప్రతి కవితా నిరూపిస్తున్నది. కవిత్వ ఆవరణంలోకి ప్రవేశించాక ఎప్పుడు ఏకవి ఓ గొప్ప కవితతో మన ముందుకి ప్రత్యక్షమవుతాడో ఖచ్చితంగా చెప్పలేము. కవిత్వకళ నేర్చుకున్నాక తపస్సు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అశ్వరరెడ్డి అక్షరయాత్ర చేస్తున్నాడు. సాహిత్యయాత్ర నిర్విరామంగా చేస్తున్నాడు. కవికి ఎన్నో దీక్షలు కావాల్సి వస్తుంది. ఆ దక్షయజ్ఞంలో కవి ఎవడ్నీ లెక్కచేయడు. నీవు ఎవడైతేం నాకేమిటి అనే ఎదిరింపుతోనే గడుసరితనమూ ముందుకి వస్తుంది. ఆ యాతనతోనే అశ్వరరెడ్డి తన కవిత్వపుస్తకంతో మన ముందుకు వస్తున్నాడు. అతనిలో తెగింపు ఉంది. అది బరితెగింపు కాదు. ఒక తల్లి బిడ్డని కనడానికి పడే పురిటి నొప్పులు, ప్రతి కవి పడినట్టుగానే అశ్వర రెడ్డి ప్రసూతితో ప్రతిక్షణం కవిత్వం వెలువరిస్తున్నాడు. అది చాలా కష్టతరమైన అనుభవం. తప్పదు. ప్రతి కవికీ ఇది అనుభవైకవేద్యం. అశ్వరరెడ్డి ప్రతి కవితలోనూ తానుగా కనిపిస్తున్నాడు. ప్రత్యక్షమవుతున్నాడు. ఈ లక్షణం ఆధునిక కవుల్లో లోపిస్తున్నది. ఏదో ఒక రాజకీయ తాపడంతో పూనకంతో కవిత్వం రాస్తున్నారే తప్ప విషయం ఉండటం లేదు. ఆ విషపూరిత లక్షణాలు అశ్వర్ధరెడ్డిలో.............© 2017,www.logili.com All Rights Reserved.