మిత్రుడు గోవింద రెడ్డికి నమస్కారాలు.
నీ ఆరోగ్యం బాగానే వుందనుకుంటాను. మొన్న Y.C. V వచ్చి నీ ఆరోగ్యం గురించి చెప్పినాడు. నేను యింకా treatment తీసుకుంటున్నాను. పత్రిక బాధ్యతలుకూడా యింకా నేను తీసుకోలేదు. అనగా rest కూడా తీసుకుంటున్నాను.
'మార్క్సిజానికి కాలదోషం పట్టిందా' అన్న వ్యాసం గురించి నీవు 'శివరామిరెడ్డికి వ్రాసిన జాబు నిన్న ఆయన నాకు చూపించినాడు. నీకు సమాధానం వ్రాయమని ఆయన నాకు చెప్పలేదుకానీ, నేనే ఒకటి రెండు మాటలు వ్రాయదలచుకున్నాను. నేను వ్రాస్తాననికూడా ఆయనతో చెప్పలేదు. జయరాంకు జాబు వ్రాస్తూవుండి నీకూ వ్రాయాలనిపించింది. 'సవ్యసాచి' ద్వారానే సమాధానం యివ్వమని నీవు వ్రాసినావు. అది యే విధంగానూ సాధ్యం కాదు. శివరామి రెడ్డి, నేనూ కలిసినా నీ ప్రశ్నలకు decisive గా సమాధానం చెప్పలేక పోవడమేగాక, 'సవ్యసాచి' పరిధిలో ఆ ప్రశ్నలు లేవు. తాత్విక చర్చలను మన జిల్లాలో యెంతమంది భరించగలరో చెప్పు. Political battles కే పత్రిక చాలడం లేదు. Philosophical battles కూడా యీ పత్రికలోనే fight చేయడం సాధ్యం కాదు. మాకు కూడా అంత శక్తి లేదని నీకూ తెలుసుగదా.
నీవు వ్రాసిన జాబులో 'సత్యం ముసలిదౌతుందా' అన్న దానిని గురించి అడిగినావు. నీవు అడిగిన ప్రశ్నే జయరాం నన్ను కూడా యింతకుముందే అడిగినాడు. జయరాంకు చెప్పిన మాటే యిక్కడ వ్రాస్తున్నాను, Marxist senseలో సత్యం మారుతూ వుంటుందనడం నిజమే. అందును గురించి సందేహం లేదు. కానీ శివరామిరెడ్డి అన్నది ఆ sense లో కాదని నీకైనా అర్థమయ్యే వుంటుంది. కేవలం కాలం గడచినంత మాత్రాన Marxism పాతదైపోయిందనే వితండవాదులను యెదుర్కొంటూ, కాలం గడచినంత మాత్రాన scientific truths మారవుగదా అని ఆయన అన్నాడు. అసలు Marxism కు Lenin కొన్ని..............
మిత్రుడు గోవింద రెడ్డికి నమస్కారాలు. నీ ఆరోగ్యం బాగానే వుందనుకుంటాను. మొన్న Y.C. V వచ్చి నీ ఆరోగ్యం గురించి చెప్పినాడు. నేను యింకా treatment తీసుకుంటున్నాను. పత్రిక బాధ్యతలుకూడా యింకా నేను తీసుకోలేదు. అనగా rest కూడా తీసుకుంటున్నాను. 'మార్క్సిజానికి కాలదోషం పట్టిందా' అన్న వ్యాసం గురించి నీవు 'శివరామిరెడ్డికి వ్రాసిన జాబు నిన్న ఆయన నాకు చూపించినాడు. నీకు సమాధానం వ్రాయమని ఆయన నాకు చెప్పలేదుకానీ, నేనే ఒకటి రెండు మాటలు వ్రాయదలచుకున్నాను. నేను వ్రాస్తాననికూడా ఆయనతో చెప్పలేదు. జయరాంకు జాబు వ్రాస్తూవుండి నీకూ వ్రాయాలనిపించింది. 'సవ్యసాచి' ద్వారానే సమాధానం యివ్వమని నీవు వ్రాసినావు. అది యే విధంగానూ సాధ్యం కాదు. శివరామి రెడ్డి, నేనూ కలిసినా నీ ప్రశ్నలకు decisive గా సమాధానం చెప్పలేక పోవడమేగాక, 'సవ్యసాచి' పరిధిలో ఆ ప్రశ్నలు లేవు. తాత్విక చర్చలను మన జిల్లాలో యెంతమంది భరించగలరో చెప్పు. Political battles కే పత్రిక చాలడం లేదు. Philosophical battles కూడా యీ పత్రికలోనే fight చేయడం సాధ్యం కాదు. మాకు కూడా అంత శక్తి లేదని నీకూ తెలుసుగదా. నీవు వ్రాసిన జాబులో 'సత్యం ముసలిదౌతుందా' అన్న దానిని గురించి అడిగినావు. నీవు అడిగిన ప్రశ్నే జయరాం నన్ను కూడా యింతకుముందే అడిగినాడు. జయరాంకు చెప్పిన మాటే యిక్కడ వ్రాస్తున్నాను, Marxist senseలో సత్యం మారుతూ వుంటుందనడం నిజమే. అందును గురించి సందేహం లేదు. కానీ శివరామిరెడ్డి అన్నది ఆ sense లో కాదని నీకైనా అర్థమయ్యే వుంటుంది. కేవలం కాలం గడచినంత మాత్రాన Marxism పాతదైపోయిందనే వితండవాదులను యెదుర్కొంటూ, కాలం గడచినంత మాత్రాన scientific truths మారవుగదా అని ఆయన అన్నాడు. అసలు Marxism కు Lenin కొన్ని..............© 2017,www.logili.com All Rights Reserved.