యోగ విద్య- ఆవిర్భావ వికాసములు
యోగ విద్య ఆవిర్భావం : వేదభూమియైన భారతదేశంలో అనేక సత్యవిద్యలు ఆవిర్భవించినవి. వాటిలోయోగశాస్త్రం కూడా ఒకటి. యోగశాస్త్రం షడ్దర్శనాలలో ఒకటి. దర్శనం అంటే సృష్టి రహస్యాన్ని దర్శింపజేసేది. సృష్టి రహస్యాన్ని మానవుడు గ్రహించలేక శాంతి సౌఖ్యాలకు దూరమౌతున్నాడు. సృష్టి రహస్యాన్ని విభిన్న కోణాలనుండి మానవుడు దర్శించటానికి వీలుంది.
దర్శనాలు ఆరు. అవి సాంఖ్య దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, మీమాంస దర్శనం, యోగ దర్శనం, వేదాంత దర్శనం. ఈ ఆరింటిలో విశేష ప్రజాదరణను పొందింది యోగ దర్శనం. యోగ దర్శనం భారతీయుల్నే కాక విదేశాల వారిని కూడా ఆకర్షించింది. కనుక నేడు యోగ విద్యకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది.
యోగదర్శనాన్ని రూపొందించినవారు పతంజలి మహర్షి. వీరు క్రీస్తుపూర్వం వారని ప్రతీతి. పతంజలి మహర్షి తమ కాలం నాటికి యోగంపై ఉన్న అనేక అభిప్రాయాలను క్రోడీకరించి తమ తపశ్శక్తితో యోగదర్శనాన్ని రూపొందించారు. సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్యపాదం అని నాలుగు అధ్యాయాలుగా రచించిన యోగ దర్శనంలో పతంజలి మహర్షి సామాన్యుల కోసమని ఎనిమిది అంగాలతో కూడిన ప్రణాళికను ఆవిష్కరించారు. దానికే అష్టాంగ యోగమని పేరు. యోగాభ్యాసం చేసి ఫలితాన్ని సాధింపదలచినవారు ముందుగా ఈ అష్టాంగ యోగాన్ని గురించి తెలుసుకోవాలి.
అష్టాంగ యోగం : సంస్కృతంలో 'అష్ట' అంటే ఎనిమిది 'అంగ' అంటే భాగం అని అర్థం....................
1
యోగ విద్య- ఆవిర్భావ వికాసములు యోగ విద్య ఆవిర్భావం : వేదభూమియైన భారతదేశంలో అనేక సత్యవిద్యలు ఆవిర్భవించినవి. వాటిలోయోగశాస్త్రం కూడా ఒకటి. యోగశాస్త్రం షడ్దర్శనాలలో ఒకటి. దర్శనం అంటే సృష్టి రహస్యాన్ని దర్శింపజేసేది. సృష్టి రహస్యాన్ని మానవుడు గ్రహించలేక శాంతి సౌఖ్యాలకు దూరమౌతున్నాడు. సృష్టి రహస్యాన్ని విభిన్న కోణాలనుండి మానవుడు దర్శించటానికి వీలుంది. దర్శనాలు ఆరు. అవి సాంఖ్య దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, మీమాంస దర్శనం, యోగ దర్శనం, వేదాంత దర్శనం. ఈ ఆరింటిలో విశేష ప్రజాదరణను పొందింది యోగ దర్శనం. యోగ దర్శనం భారతీయుల్నే కాక విదేశాల వారిని కూడా ఆకర్షించింది. కనుక నేడు యోగ విద్యకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. యోగదర్శనాన్ని రూపొందించినవారు పతంజలి మహర్షి. వీరు క్రీస్తుపూర్వం వారని ప్రతీతి. పతంజలి మహర్షి తమ కాలం నాటికి యోగంపై ఉన్న అనేక అభిప్రాయాలను క్రోడీకరించి తమ తపశ్శక్తితో యోగదర్శనాన్ని రూపొందించారు. సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్యపాదం అని నాలుగు అధ్యాయాలుగా రచించిన యోగ దర్శనంలో పతంజలి మహర్షి సామాన్యుల కోసమని ఎనిమిది అంగాలతో కూడిన ప్రణాళికను ఆవిష్కరించారు. దానికే అష్టాంగ యోగమని పేరు. యోగాభ్యాసం చేసి ఫలితాన్ని సాధింపదలచినవారు ముందుగా ఈ అష్టాంగ యోగాన్ని గురించి తెలుసుకోవాలి. అష్టాంగ యోగం : సంస్కృతంలో 'అష్ట' అంటే ఎనిమిది 'అంగ' అంటే భాగం అని అర్థం.................... 1© 2017,www.logili.com All Rights Reserved.