శేషాద్రి రమణ కవులు
ఈ శతాబ్దం మొదటిపాదం ఎక్కువగా అవధానాలతోనో ఆశు కవిత్వాలతోనో కోలాహలంగా గడిచింది. ఆ కోలాహలాన్ని కొందరు ఎక్కటిగాను మరికొందరు సోదరులు లేదా స్నేహితులు జంటలుగా కూడి సృష్టించినారు. అట్టి జంటల్లో శేషాద్రి రమణ కవుల దొక జంట. చాలామంది జంటకవులు అవధానాలు ఆశుకవిత్వాలు ఇప్పటికే గాలిలో కలిసిపోయినవి. అచ్చైన పుస్తకాలు కూడ 'అపురూపమై' పోయినవి. తాత్కాలికంగా చాలామందికి కీర్తి ప్రతిష్ఠలు లభించినా కాలం గడచినకొద్దీ ఆమూర్తులు విస్మృతిపథాన పడిపోతున్నారు. పదికాలాలపాటు బ్రతికే రచనలు చేసేవారే భావితరాలవారికి జ్ఞాపకం వస్తూంటారు. 'శేషాద్రి రమణ కవులు' అవధానాల రచనలతోపాటు చరిత్ర పరిశోధన, పాతకాలపు నాణాల సేకరణ, ప్రాచీనతాళపత్ర గ్రంథాల సంగ్రహణం, వాటి పరిష్కరణం, కావ్య ప్రబంధాలకు వ్యాఖ్యానం మొదలైన పనులు కూడ పూటిగా చేసినారు. కనుక ఏదో ఒక రంగంలో ఎప్పుడో భావితరాలవారికి జ్ఞప్తికి వస్తూనే ఉంటారు. ఐతే తెలంగాణానికి మాత్రం వారు ఎప్పుడూ ప్రాతస్మరణీయులు. తెలంగాణంలో వారు తిరిగినన్ని ఊళ్ళు, వారు సేకరించినన్ని తాళపత్ర గ్రంథాలు, నాణాలు, వారు సంపాదించినన్ని శాసనాలు' వ్యక్తిగతంగా మరెవ్వరూ అంతపని చేయలేదు.
ఆచార్యులవారు ఓ అంటే ఓ అని మారుపల్కరించేవి. ఇక్కడి ప్రాచీన దుర్గకుడ్యాలు, మందిరాలు, చారిత్రక ప్రదేశాలు, వారి అలికిడి కనిపెట్టి భూగర్భంలోనుంచి నిక్కిచూచేవి. మూగవోయిన శిలాశాసనాలు వారి మాట సవ్వడి విని బూజు దులుపుకుంటూ అటుకులపై నుండి దుమికేవి. తాళపత్రగ్రంథాలు, ఆచార్యులవారికి తెలంగాణంతో ఏదో పూర్వజన్మ సంబంధం ఉండి ఉండాలె................
శేషాద్రి రమణ కవులు ఈ శతాబ్దం మొదటిపాదం ఎక్కువగా అవధానాలతోనో ఆశు కవిత్వాలతోనో కోలాహలంగా గడిచింది. ఆ కోలాహలాన్ని కొందరు ఎక్కటిగాను మరికొందరు సోదరులు లేదా స్నేహితులు జంటలుగా కూడి సృష్టించినారు. అట్టి జంటల్లో శేషాద్రి రమణ కవుల దొక జంట. చాలామంది జంటకవులు అవధానాలు ఆశుకవిత్వాలు ఇప్పటికే గాలిలో కలిసిపోయినవి. అచ్చైన పుస్తకాలు కూడ 'అపురూపమై' పోయినవి. తాత్కాలికంగా చాలామందికి కీర్తి ప్రతిష్ఠలు లభించినా కాలం గడచినకొద్దీ ఆమూర్తులు విస్మృతిపథాన పడిపోతున్నారు. పదికాలాలపాటు బ్రతికే రచనలు చేసేవారే భావితరాలవారికి జ్ఞాపకం వస్తూంటారు. 'శేషాద్రి రమణ కవులు' అవధానాల రచనలతోపాటు చరిత్ర పరిశోధన, పాతకాలపు నాణాల సేకరణ, ప్రాచీనతాళపత్ర గ్రంథాల సంగ్రహణం, వాటి పరిష్కరణం, కావ్య ప్రబంధాలకు వ్యాఖ్యానం మొదలైన పనులు కూడ పూటిగా చేసినారు. కనుక ఏదో ఒక రంగంలో ఎప్పుడో భావితరాలవారికి జ్ఞప్తికి వస్తూనే ఉంటారు. ఐతే తెలంగాణానికి మాత్రం వారు ఎప్పుడూ ప్రాతస్మరణీయులు. తెలంగాణంలో వారు తిరిగినన్ని ఊళ్ళు, వారు సేకరించినన్ని తాళపత్ర గ్రంథాలు, నాణాలు, వారు సంపాదించినన్ని శాసనాలు' వ్యక్తిగతంగా మరెవ్వరూ అంతపని చేయలేదు. ఆచార్యులవారు ఓ అంటే ఓ అని మారుపల్కరించేవి. ఇక్కడి ప్రాచీన దుర్గకుడ్యాలు, మందిరాలు, చారిత్రక ప్రదేశాలు, వారి అలికిడి కనిపెట్టి భూగర్భంలోనుంచి నిక్కిచూచేవి. మూగవోయిన శిలాశాసనాలు వారి మాట సవ్వడి విని బూజు దులుపుకుంటూ అటుకులపై నుండి దుమికేవి. తాళపత్రగ్రంథాలు, ఆచార్యులవారికి తెలంగాణంతో ఏదో పూర్వజన్మ సంబంధం ఉండి ఉండాలె................© 2017,www.logili.com All Rights Reserved.