మున్నుడి
అసలు ఎందుకు రాయాలి? ఎవరి గురించైనా ఎందుకు రాయాలి? ఈ గురించే ఎందుకు రాయాలి? రాయకపోతే ఏమవుతుంది? రాస్తే ఏమొస్తుంది? అందరు అలా అనుకుంటే మరుగునపడి ఉండిపోయిన రత్నాల్లాంటివాళ్ళ జీవితం ప్రపంచానికిం తెలుస్తుంది? ఏం? తెలియకపోతే ప్రపంచానికేం నష్టం? పోనీ తెలిస్తే ప్రపంచ గమనంలో కనీసం ఒక్క వ్యక్తి మీదైనా ప్రభావం పడుతుందా? అయ్యో రామా! పుస్తకాలవలన, ప్రవచనాల వలన మనుషులు మారిపోతే ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? ఇంత అశాంతి, ఆందోళన, అరాచకం, అస్తవ్యస్తం ఎందుకుంటాయి? సుందర, సుమధుర, సుఖప్రద జీవనం పగటికలగా ఎందుకు మారిపోతుంది? అయ్యో! ఇలా ఆలోచిస్తూపోతే ఏ పనీ చెయ్యకుండా కేవలం ఆహార, నిద్ర, భయ, మైథునాలకు పరిమితమైపోయి. టైమయిపోయినప్పుడు వెళ్ళిపోవడం తప్ప ఏమీ చెయ్యలేం.
-
ఇలా తర్కం యొక్క ప్రభావం ఎక్కువ అవడం వలన చాలాసార్లు ఈ పుస్తకం రాయడానికి, ఇతరత్రా రచనలు చేయడానికి ఉపక్రమించి విరమించుకోవటం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయంలోనూ అవసరానికి మించి తర్కించి, చివరకు నిష్క్రియా పరత్వానికి, నిరాశావాదానికి బందీనై పోతున్నానేమో అనిపించి, అసలెవరూ ఏమీ చదవరు! ఎవరూ మారరు! మంచి చెప్పడం అనవసరం అని ఒక నిర్ణయానికి వచ్చేయటం తొందరపాటు కాదా? ప్రపంచపు పోకడమీద తీర్పు చెప్పే అధికారం నాకుందా? అనే ఆలోచన నన్ను నా ఆలోచనా విధానాన్ని పునఃపరిశీలించేలా చేసింది. మా అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆశావాద మనస్తత్వం- 'చెడు ఋజువు అయ్యేవరకు ప్రపంచంలో మంచిని, ఆశను మాత్రమే చూడు! చెడు ఎదురైతే అక్కడే ఆగిపోక, కూలిపోక, చెడును ప్రక్కకు నెట్టి, నీ దారిలో ముందుకి సాగిపో!'- అనే ఫిలాసఫీని స్మరించుకొని, మా నాన్నగారి జీవితచరిత్రను రాయటానికి పూనుకొన్నాను.
మా నాన్నగారు కీ॥శే॥ డా॥ సి.వి.యోగిగారు తన జీవితకాలంలో తన చుట్టుప్రక్కల ఉన్న వారందరి జీవితాలను ప్రభావితం చేశారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ మా సోదరులందరం పూర్తిగా శాంతియుతమైన, సంఘర్షణలేని జీవితాన్ని గడుపుతున్నాము.......................
మున్నుడి అసలు ఎందుకు రాయాలి? ఎవరి గురించైనా ఎందుకు రాయాలి? ఈ గురించే ఎందుకు రాయాలి? రాయకపోతే ఏమవుతుంది? రాస్తే ఏమొస్తుంది? అందరు అలా అనుకుంటే మరుగునపడి ఉండిపోయిన రత్నాల్లాంటివాళ్ళ జీవితం ప్రపంచానికిం తెలుస్తుంది? ఏం? తెలియకపోతే ప్రపంచానికేం నష్టం? పోనీ తెలిస్తే ప్రపంచ గమనంలో కనీసం ఒక్క వ్యక్తి మీదైనా ప్రభావం పడుతుందా? అయ్యో రామా! పుస్తకాలవలన, ప్రవచనాల వలన మనుషులు మారిపోతే ప్రపంచం ఇలా ఎందుకుంటుంది? ఇంత అశాంతి, ఆందోళన, అరాచకం, అస్తవ్యస్తం ఎందుకుంటాయి? సుందర, సుమధుర, సుఖప్రద జీవనం పగటికలగా ఎందుకు మారిపోతుంది? అయ్యో! ఇలా ఆలోచిస్తూపోతే ఏ పనీ చెయ్యకుండా కేవలం ఆహార, నిద్ర, భయ, మైథునాలకు పరిమితమైపోయి. టైమయిపోయినప్పుడు వెళ్ళిపోవడం తప్ప ఏమీ చెయ్యలేం. - ఇలా తర్కం యొక్క ప్రభావం ఎక్కువ అవడం వలన చాలాసార్లు ఈ పుస్తకం రాయడానికి, ఇతరత్రా రచనలు చేయడానికి ఉపక్రమించి విరమించుకోవటం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయంలోనూ అవసరానికి మించి తర్కించి, చివరకు నిష్క్రియా పరత్వానికి, నిరాశావాదానికి బందీనై పోతున్నానేమో అనిపించి, అసలెవరూ ఏమీ చదవరు! ఎవరూ మారరు! మంచి చెప్పడం అనవసరం అని ఒక నిర్ణయానికి వచ్చేయటం తొందరపాటు కాదా? ప్రపంచపు పోకడమీద తీర్పు చెప్పే అధికారం నాకుందా? అనే ఆలోచన నన్ను నా ఆలోచనా విధానాన్ని పునఃపరిశీలించేలా చేసింది. మా అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆశావాద మనస్తత్వం- 'చెడు ఋజువు అయ్యేవరకు ప్రపంచంలో మంచిని, ఆశను మాత్రమే చూడు! చెడు ఎదురైతే అక్కడే ఆగిపోక, కూలిపోక, చెడును ప్రక్కకు నెట్టి, నీ దారిలో ముందుకి సాగిపో!'- అనే ఫిలాసఫీని స్మరించుకొని, మా నాన్నగారి జీవితచరిత్రను రాయటానికి పూనుకొన్నాను. మా నాన్నగారు కీ॥శే॥ డా॥ సి.వి.యోగిగారు తన జీవితకాలంలో తన చుట్టుప్రక్కల ఉన్న వారందరి జీవితాలను ప్రభావితం చేశారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ మా సోదరులందరం పూర్తిగా శాంతియుతమైన, సంఘర్షణలేని జీవితాన్ని గడుపుతున్నాము.......................© 2017,www.logili.com All Rights Reserved.