తమిళ సాహిత్యంలో అత్యంత ప్రధానమైన రచనల్లో తిరుక్కురళ్ ఒకటి. తెలుగు ద్విపదలాంటి రెండేసి చిన్న పాదాల పద్యాల సముదాయం కురళ్. దీనిలో 133 విషయాలున్నాయి. ఒక్కొక్కదానిపై పది కురళ్ లుంటాయి. మొత్తం 1330 పద్యాలు. రాజులు, స్నేహం, వ్యవసాయం, దేవుడు, సన్యాసులు, సజ్జనులు, గృహస్థులు, ఇల్లాలు, మంత్రులు, పరిపాలన, ప్రేమ, వర్షం ఇలా లౌకిక ప్రపంచానికి సంబంధించి కురళ్ తడమని విషయం ఉండదు. చతుర్విధ పురుషార్థ సాధనను కురళ్ ప్రతిపాదిస్తుంది.