పందిరి అల్లుకుంటున్న కథానికలు
ఏ కథానిక అయినా జీవితచిత్రణే. ఊహాత్మక జీవిత చిత్రణ కాక రచయిత అనుభవ పరిధిలోకి వచ్చ జీవిత చిత్రణలో విశ్వసనీయత ఎక్కువ. స్థలకాలాలు, వాటి మూలంగా అమిరే వాతావరణంలో పాఠకుడు సులభంకగా మమేకమవుతాడు. కథానిక ఆకృతిలో చిన్నది కావటం వల్ల జీవితభాగం లేదా ఒక కోణం మాత్రమే అందులో ఆవిష్కృతమవుతుంది. ఒక ప్రధాన అంశం ఒక ప్రధాన సంఘటన, ఒకటిరెండు సన్నివేశాలు కలగలసివున్న సృజనాత్మక రూపంగా కథానికను విజ్ఞులు నిర్వచిస్తున్నారు. ఈ నిర్వచనానికి దగ్గరగా కథానికలు రాస్తున్న రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి గారు. 'ఊరువాడ బతుకు', 'మా యాత్ర', 'కథలగూడు', 'బయటి గుడిసెలు' వంటి పుస్తకాల ద్వారా కృష్ణమూర్తి గారు ప్రసిద్ధులు.
రెవెన్యూశాఖలో తహసిల్దారుగా నల్లగొండ జిల్లాలో చిరకాలం పనిచేసిన కృష్ణమూర్తి గారు 'ఊరువాడ బతుకు' నవలలోని గ్రామీణ అమాయక బాలుడి సరళ జీవిత చిత్రణతో తెలుగు సాహిత్యంలో ఒక చిన్నపూల తోటను సృష్టించారు. వేలాది పాఠకులు వసంత సమీరాలై చిన్న పిల్లవాడి వచ్చి ఆ తోట పరిమళాలను సొంతం చేసుకున్నారు. పికాసో అనేవాడట లాగా రాయటం, గీయటం కష్టమని. రచనలో చిన్నపిల్లవాడిని చిత్రించటం కూడా సులభం కాదు.
కృష్ణమూర్తిగారు ముందుగా ఉత్తమ సాహిత్య పాఠకుడు. అనేక సాహిత్య సంస్థలతో సంబంధాలున్న కార్యకర్త. ఆ తర్వాత సాహిత్య విమర్శను చదువుకున్న వివేకి. ఆధునిక సాహిత్యంలో వారు చదవని పుస్తకం లేదంటారు. వారికి కళలతో కూడా తగుమాత్రం పరిచయం వుంది. వీటన్నిటి మూలంగా వారు ముందుగా మనస్విగా రూపొంది, ఉద్యోగ విరమణ తర్వాత రచయిత పాత్రలోకి సహజంగా ప్రవేశించారు. ఇందుకు ప్రధానకారణం- ఇతరులు చెప్పంది. తాను.............
పందిరి అల్లుకుంటున్న కథానికలు ఏ కథానిక అయినా జీవితచిత్రణే. ఊహాత్మక జీవిత చిత్రణ కాక రచయిత అనుభవ పరిధిలోకి వచ్చ జీవిత చిత్రణలో విశ్వసనీయత ఎక్కువ. స్థలకాలాలు, వాటి మూలంగా అమిరే వాతావరణంలో పాఠకుడు సులభంకగా మమేకమవుతాడు. కథానిక ఆకృతిలో చిన్నది కావటం వల్ల జీవితభాగం లేదా ఒక కోణం మాత్రమే అందులో ఆవిష్కృతమవుతుంది. ఒక ప్రధాన అంశం ఒక ప్రధాన సంఘటన, ఒకటిరెండు సన్నివేశాలు కలగలసివున్న సృజనాత్మక రూపంగా కథానికను విజ్ఞులు నిర్వచిస్తున్నారు. ఈ నిర్వచనానికి దగ్గరగా కథానికలు రాస్తున్న రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి గారు. 'ఊరువాడ బతుకు', 'మా యాత్ర', 'కథలగూడు', 'బయటి గుడిసెలు' వంటి పుస్తకాల ద్వారా కృష్ణమూర్తి గారు ప్రసిద్ధులు. రెవెన్యూశాఖలో తహసిల్దారుగా నల్లగొండ జిల్లాలో చిరకాలం పనిచేసిన కృష్ణమూర్తి గారు 'ఊరువాడ బతుకు' నవలలోని గ్రామీణ అమాయక బాలుడి సరళ జీవిత చిత్రణతో తెలుగు సాహిత్యంలో ఒక చిన్నపూల తోటను సృష్టించారు. వేలాది పాఠకులు వసంత సమీరాలై చిన్న పిల్లవాడి వచ్చి ఆ తోట పరిమళాలను సొంతం చేసుకున్నారు. పికాసో అనేవాడట లాగా రాయటం, గీయటం కష్టమని. రచనలో చిన్నపిల్లవాడిని చిత్రించటం కూడా సులభం కాదు. కృష్ణమూర్తిగారు ముందుగా ఉత్తమ సాహిత్య పాఠకుడు. అనేక సాహిత్య సంస్థలతో సంబంధాలున్న కార్యకర్త. ఆ తర్వాత సాహిత్య విమర్శను చదువుకున్న వివేకి. ఆధునిక సాహిత్యంలో వారు చదవని పుస్తకం లేదంటారు. వారికి కళలతో కూడా తగుమాత్రం పరిచయం వుంది. వీటన్నిటి మూలంగా వారు ముందుగా మనస్విగా రూపొంది, ఉద్యోగ విరమణ తర్వాత రచయిత పాత్రలోకి సహజంగా ప్రవేశించారు. ఇందుకు ప్రధానకారణం- ఇతరులు చెప్పంది. తాను.............© 2017,www.logili.com All Rights Reserved.