తనలోని వేడి తనను కాల్చివేస్తున్నదో, గంగాజలమే వేడిగా వున్నదోనని తర్కింపలేక ధృతరాష్ట్రుడు అసహనం చెందుతూ ఉధృతంగా పారుతున్న నీటిలో నిలువలేక ఆతంకంతో సహాయానికై చేయిచాచిన వెంటనే అక్కడేవున్న సంజయుడు తల్లడిల్లిపోయాడు. మహారాజుగారి దుర్భలమైన దేహాన్ని తనచేతులతో పట్టి మెల్లగా నడిపించుకొని ఒడ్డుకు పిలుచుకొని వచ్చాడు. మహారాజుగారికి వయసైందని అతడీమధ్య నిట్టూర్పు విడువని రోజులేదు. పాపం నిలుచున్న చోటనే తూగటిస్తారు, తత్తరపడిపోతారు.
'హస్తినాపురం రాజమందిరాన్ని శాశ్వతంగా త్యజించి శేషాయుస్సును వానప్రస్థంలో గడుపుదామని సలహా యిచ్చిన సోదరుడు విదురునిమాటను మీరలేక యిపుడు అరణ్యానికి వచ్చినప్పటికీ, మహారాజువారికింకా వైరాగ్యం అబ్బలేదు. ధ్యానంలోనూ, తపస్సులోనూ మునిగిపోవడం వారికింకా అలవాటు కాలేదు. మౌనంగా కూర్చొని గతించిపోయిన సంగతులను జ్ఞాపించుకొని అదేమిటో అస్పష్టంగా వదురుతుంటారు. మారినపరిసరాలు మహారాజుపాలిట చాలా అసహనీయమయ్యాయి. ఈ తాపస వృత్తిని ఒప్పుకోవడం అతని మనసుకు సరిపడడం లేదు. అతని దేహం అలాంటి స్థితికి సిద్ధంగా లేదేమో! అంతూ అరణ్యానికి వచ్చినప్పటినుండి మహారాజుగారికి పరితాపం తప్పలేదు.
ధృతరాష్ట్రుడు సంజయుని ఆసరాతో నిధానంగా నడుస్తూ నదిఒడ్డున కొద్ది దూరంలో నిర్మించబడిన కుటీరం వద్దకు వచ్చాడు. అదొక ప్రశాంత మనోహరమైన ప్రదేశం. చుట్టూ దట్టమైన అడవి. గాలిలో తేలివస్తున్న అడవిపూల పరిమళం, తంపు తంపుగా హితకరమైన గాలి. 'ఇటువంటి సుందర వాతావరణంలో కూర్చొని విదురుడు చెప్పినట్టు భగవంతుని ధ్యానిస్తామనుకొంటే మనసులోని చాంచల్యం విడువడంలేదు కదా!' అని
ధృతరాష్ట్రుడు మనసులోనే వేదన చెందాడు. తన జీవితంలో గడించినదంతటినీ పోగొట్టుకొన్నతర్వాత మనసుపై నియంత్రణ సాధ్యం కావడం లేదు. ఏదో ఒకరకమైన ఉదాసీనత వచ్చేసింది. ఈ అవస్థకు కారణమేమిటో - ఏం ధ్యానమో! ఏం తపస్సో! ఎక్కడుంటుంది ఏకాగ్రత?' అని అడుగడుక్కూ మనసు వ్యగ్రమవుతుండగా, నిరాశతో తలను బాదుకొన్నాడు. 'ఛీ, ఎటువంటి దౌర్భాగ్యం తనది! అపుడు రాజమందిరంలో వున్నపుడూ ఒకరకమైన...................అంధ పర్వం
వానప్రస్థపు విస్మృతి
తనలోని వేడి తనను కాల్చివేస్తున్నదో, గంగాజలమే వేడిగా వున్నదోనని తర్కింపలేక ధృతరాష్ట్రుడు అసహనం చెందుతూ ఉధృతంగా పారుతున్న నీటిలో నిలువలేక ఆతంకంతో సహాయానికై చేయిచాచిన వెంటనే అక్కడేవున్న సంజయుడు తల్లడిల్లిపోయాడు. మహారాజుగారి దుర్భలమైన దేహాన్ని తనచేతులతో పట్టి మెల్లగా నడిపించుకొని ఒడ్డుకు పిలుచుకొని వచ్చాడు. మహారాజుగారికి వయసైందని అతడీమధ్య నిట్టూర్పు విడువని రోజులేదు. పాపం నిలుచున్న చోటనే తూగటిస్తారు, తత్తరపడిపోతారు.'హస్తినాపురం రాజమందిరాన్ని శాశ్వతంగా త్యజించి శేషాయుస్సును వానప్రస్థంలో గడుపుదామని సలహా యిచ్చిన సోదరుడు విదురునిమాటను మీరలేక యిపుడు అరణ్యానికి వచ్చినప్పటికీ, మహారాజువారికింకా వైరాగ్యం అబ్బలేదు. ధ్యానంలోనూ, తపస్సులోనూ మునిగిపోవడం వారికింకా అలవాటు కాలేదు. మౌనంగా కూర్చొని గతించిపోయిన సంగతులను జ్ఞాపించుకొని అదేమిటో అస్పష్టంగా వదురుతుంటారు. మారినపరిసరాలు మహారాజుపాలిట చాలా అసహనీయమయ్యాయి. ఈ తాపస వృత్తిని ఒప్పుకోవడం అతని మనసుకు సరిపడడం లేదు. అతని దేహం అలాంటి స్థితికి సిద్ధంగా లేదేమో! అంతూ అరణ్యానికి వచ్చినప్పటినుండి మహారాజుగారికి పరితాపం తప్పలేదు.ధృతరాష్ట్రుడు సంజయుని ఆసరాతో నిధానంగా నడుస్తూ నదిఒడ్డున కొద్ది దూరంలో నిర్మించబడిన కుటీరం వద్దకు వచ్చాడు. అదొక ప్రశాంత మనోహరమైన ప్రదేశం. చుట్టూ దట్టమైన అడవి. గాలిలో తేలివస్తున్న అడవిపూల పరిమళం, తంపు తంపుగా హితకరమైన గాలి. 'ఇటువంటి సుందర వాతావరణంలో కూర్చొని విదురుడు చెప్పినట్టు భగవంతుని ధ్యానిస్తామనుకొంటే మనసులోని చాంచల్యం విడువడంలేదు కదా!' అనిధృతరాష్ట్రుడు మనసులోనే వేదన చెందాడు. తన జీవితంలో గడించినదంతటినీ పోగొట్టుకొన్నతర్వాత మనసుపై నియంత్రణ సాధ్యం కావడం లేదు. ఏదో ఒకరకమైన ఉదాసీనత వచ్చేసింది. ఈ అవస్థకు కారణమేమిటో - ఏం ధ్యానమో! ఏం తపస్సో! ఎక్కడుంటుంది ఏకాగ్రత?' అని అడుగడుక్కూ మనసు వ్యగ్రమవుతుండగా, నిరాశతో తలను బాదుకొన్నాడు.'ఛీ, ఎటువంటి దౌర్భాగ్యం తనది! అపుడు రాజమందిరంలో వున్నపుడూ ఒకరకమైన...................