తెలుగులో కథా సాహిత్యం పుష్కలంగా వెలువడినప్పటికీ తెలంగాణలో రావాల్సినంతగా రాలేదన్నది సత్యం. ఈ ప్రాంత ప్రజా జీవితంలోని ఘర్షణలను, మలుపులను,స్వభావాలను ఎప్పటికప్పుడు అందుకోలేక పోతున్నది. కవిత్వ రూపాలతో పోల్చి చూసినపుడు కథారచనలో కొంత వెలితి కనబడుతున్నది. వేణు నక్షత్రం తెలంగాణ కథకు కొత్త కాంతినద్దుతూ వెలుగిస్తున్న కథా సంపుటి మౌనసాక్షి. వేణు చేయి తిరిగిన కథకుడు తొంబయ్యోదశకంలో తెలుగు సాహిత్యంలో బాధ్యతతో కలం తిప్పిన రచయితే. పర్యవసానం కథతో ఆలోచనాపరుల్ని ఆకట్టుకున్న రచయిత రెండు దశాబ్దాల జీవన పోరాటం అక్షరాల నుంచి దూరం చేయగలిగినా, ఆలోచనల నుంచి అవగాహన నుంచి విడదీయలేకపోయింది. లఘు చిత్ర నిర్మాణం వైపు మళ్లి 'పిలుపు', 'ఎంతెంతదూరం', 'అవతలివైపు', మూడు ప్రయోగాలు చేశాడు. వర్తమాన సామాజిక పరిణామాలు మానవీయ విలువలను ఎట్లా క్షోభపెడుతున్నాయో స్పష్టంగా వివరించాడు. ఇప్పుడు ప్రచురిస్తున్న ఈ పదకొండు కథలు రచయిత పరివేదనను ప్రతిబింబిస్తున్నాయి. హృదయమున్న ఏ రచయితయినా జరుగుతున్న పరిణామాల తీవ్రతకు ఒత్తిడి పడకుండా ఉండలేడు. మనుషులుగా క్షిణిస్తున్న విషాద సందర్భానికి దుఃఖించకుండా తప్పించుకోలేడు. వేణు హృదయమున్న చింతనాపరుడు. రెండు దశాబ్దాల సామాజిక విప్లవోద్యమాలతో కలసి నడిచిన భావకుడు. కళ్ళనిండా కలలతో, మనసు నిండా భావోద్వేగాలతో, జీవితమంతా ఆకాంక్షలతో ఉప్పొంగి ఊగిన ఊహాజీవే.
- నక్షత్రం వేణుగోపాల్