ఆధునిక జీవితం ఆలోచనలకు తీరిక లేనంతటి జీవనశైలిని అందిస్తుంది. కార్యకారణాలు అర్థం కానంతటి సంక్లిష్టతను విధిస్తుంది. అనేక పొరల సమాజాలు, వివిధ తారతమ్యాల జీవితాలు, తరాల అంతరాలు, ముంచుకొస్తున్న మార్పులు, అందుబాటులో లేని అందలాలు, అందివచ్చే ఎండమావులు అన్నీ కలిసి ప్రస్తుత జీవితాన్ని జటిలమూ అసాధ్యమూ చేస్తున్నాయి. వీటి మధ్య నుంచి నెగ్గుకురావాలంటే, కనీసం మనుగడలో మిగలాలంటే, కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. చరిత్ర నుంచి, అనుభవం నుంచి నేర్చుకోవాలి. తప్పొప్పులు చెప్పగలిగే మార్గదర్శనం కావాలి. ఎదురీతే అయినా, మంచిని మిగిలించే ప్రయత్నం చేయాలి.
అన్నిటికిమించి, ఎదురుగా కనిపిస్తున్న అసంబద్ధతలను గుర్తించగలిగి, చెడ్డతనంలో ఊపిరాడనితనమేదో ఉండాలి. ఆ సుగుణాలు ఉన్నవారు లోకంలో కొద్దిమంది అయినా ఉంటారు. రకరకాల రంగాలలో ఉంటారు. ఆలోచనలకు జాగ్రత్తగా పోతపోయగలిగిన, అక్షరాలపై లాఘవంగా స్వారీ చేయగలిగిన రచయితలకు ఆ గుణాలుంటే పాఠకులకు, సమాజానికి కొండంత అండ. నా పాత్రికేయ సహచరుడు మంగేష్ సమాజానికి మంచిచెడ్డలను విడమరచి చెప్పే సహృదయ ప్రయత్నాన్ని ఈ రచనలలో చేశారు. మానవ,సమాజ సంబంధాలలోని పీటముడులను, మనసులను కల్లోలితం చేస్తున్న సంక్షోభాలను, వాటిని అధిగమించడానికి చేయగలిగిన చిన్న చిన్న ప్రయత్నాలను ఈ వ్యాసాలలో మంగేష్ స్పృశించారు.
ఆధునిక జీవితం ఆలోచనలకు తీరిక లేనంతటి జీవనశైలిని అందిస్తుంది. కార్యకారణాలు అర్థం కానంతటి సంక్లిష్టతను విధిస్తుంది. అనేక పొరల సమాజాలు, వివిధ తారతమ్యాల జీవితాలు, తరాల అంతరాలు, ముంచుకొస్తున్న మార్పులు, అందుబాటులో లేని అందలాలు, అందివచ్చే ఎండమావులు అన్నీ కలిసి ప్రస్తుత జీవితాన్ని జటిలమూ అసాధ్యమూ చేస్తున్నాయి. వీటి మధ్య నుంచి నెగ్గుకురావాలంటే, కనీసం మనుగడలో మిగలాలంటే, కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. చరిత్ర నుంచి, అనుభవం నుంచి నేర్చుకోవాలి. తప్పొప్పులు చెప్పగలిగే మార్గదర్శనం కావాలి. ఎదురీతే అయినా, మంచిని మిగిలించే ప్రయత్నం చేయాలి. అన్నిటికిమించి, ఎదురుగా కనిపిస్తున్న అసంబద్ధతలను గుర్తించగలిగి, చెడ్డతనంలో ఊపిరాడనితనమేదో ఉండాలి. ఆ సుగుణాలు ఉన్నవారు లోకంలో కొద్దిమంది అయినా ఉంటారు. రకరకాల రంగాలలో ఉంటారు. ఆలోచనలకు జాగ్రత్తగా పోతపోయగలిగిన, అక్షరాలపై లాఘవంగా స్వారీ చేయగలిగిన రచయితలకు ఆ గుణాలుంటే పాఠకులకు, సమాజానికి కొండంత అండ. నా పాత్రికేయ సహచరుడు మంగేష్ సమాజానికి మంచిచెడ్డలను విడమరచి చెప్పే సహృదయ ప్రయత్నాన్ని ఈ రచనలలో చేశారు. మానవ,సమాజ సంబంధాలలోని పీటముడులను, మనసులను కల్లోలితం చేస్తున్న సంక్షోభాలను, వాటిని అధిగమించడానికి చేయగలిగిన చిన్న చిన్న ప్రయత్నాలను ఈ వ్యాసాలలో మంగేష్ స్పృశించారు.© 2017,www.logili.com All Rights Reserved.