Toli Malitaram Telugu Kathalu

Rs.250
Rs.250

Toli Malitaram Telugu Kathalu
INR
MANIMN0108
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              2010 సంవత్సరంలో తెలుగు కథ శతజయంతి జరిగింది. కాని అప్పటికి ఇరవై సంవత్సరాలకు ముందునుంచే కథారచన ఉందంటున్నారు తత్త్వవేచకులు. సమాజంతో పాటు తెలుగు కథ కూడా ప్రభావితమైంది. అప్పటి ఆచారవ్యవహారాలూ, సామాజిక జీవితం, సమస్యలు, సంఘర్షణలు, కష్టాలు, కన్నీళ్లు ఇప్పటి వారికి వింతగా తోచవచ్చు. తెలుగుకథ ఈ సామాజిక పరిణామ పర్యవసానాలను బలంగా ఇతివృత్తీకరించింది. బహుశా ఈ నూరు నూటయాభై ఏళ్లలో ఈ ప్రక్రియను అభిమానించిన, అలరించిన విశిష్ట రచయితలు మరే ఆధునిక సాహిత్య తెలుగు ప్రక్రియకూ లేరనే చెప్పాలి. ఇంత సంఖ్యలో మరే ప్రక్రియా సంబంధి రచనలు వెలువడలేదు.

                  అంతేకాదు, సమకాలీన సమాజపు పోకడలను, పరిణామాలను, పర్యవసానాలను మంచి చెడ్డలను ఈ సాహిత్య ప్రక్రియ చిత్రించినంత విస్తారంగా, బలంగా, ప్రతిభా శీలంగా మరే ప్రక్రియా చిత్రించగల అవకాశం లేదు కదా! తక్కిన ప్రక్రియలు ఏవైనా సమాజపు ఒడిదుడుకుల ఒక పార్శ్వాన్ని, ఒక ప్రబల సమస్యను మాత్రమే చిత్రించగల సామర్థ్యం మాత్రమే చూపగలవు. కథ విషయం అటువంటిది కాదు. సమగ్ర, సంపూర్ణ మానవసమాజాన్ని కథ ఆవిష్కరించగలదు. కథలో పల్లె జీవ సాక్షాత్కార పాత్రలు నాటకం, నాటిక, నవల వంటి వచన ప్రక్రియలలో చూపగలిగిన అవి వస్త్వాశ్రయాలు మాత్రమే కాగలవుకాని, ఆత్మాశ్రయాలు కావు. హృదయదఘ్నమైన అనుభూతులను కథ ఆవిష్కరించినంతగా మరి ఏ ఇతర సృజనాత్మక సాహిత్య ప్రక్రియ ఆవిష్కరించటం కుదరదేమో!

                       ఈ కథా సంకలనం వల్ల తెలుగు కథ వస్తు రూప శిల్ప వికాసం, పరిణామ క్రమం కూడా అవగతమవుతుంది. నూరేళ్ళనాటి కథా రచనా వస్తువు లేవిధంగా ఉండేవో ఈ సంకలనం స్పష్టం చేస్తుంది.

              2010 సంవత్సరంలో తెలుగు కథ శతజయంతి జరిగింది. కాని అప్పటికి ఇరవై సంవత్సరాలకు ముందునుంచే కథారచన ఉందంటున్నారు తత్త్వవేచకులు. సమాజంతో పాటు తెలుగు కథ కూడా ప్రభావితమైంది. అప్పటి ఆచారవ్యవహారాలూ, సామాజిక జీవితం, సమస్యలు, సంఘర్షణలు, కష్టాలు, కన్నీళ్లు ఇప్పటి వారికి వింతగా తోచవచ్చు. తెలుగుకథ ఈ సామాజిక పరిణామ పర్యవసానాలను బలంగా ఇతివృత్తీకరించింది. బహుశా ఈ నూరు నూటయాభై ఏళ్లలో ఈ ప్రక్రియను అభిమానించిన, అలరించిన విశిష్ట రచయితలు మరే ఆధునిక సాహిత్య తెలుగు ప్రక్రియకూ లేరనే చెప్పాలి. ఇంత సంఖ్యలో మరే ప్రక్రియా సంబంధి రచనలు వెలువడలేదు.                   అంతేకాదు, సమకాలీన సమాజపు పోకడలను, పరిణామాలను, పర్యవసానాలను మంచి చెడ్డలను ఈ సాహిత్య ప్రక్రియ చిత్రించినంత విస్తారంగా, బలంగా, ప్రతిభా శీలంగా మరే ప్రక్రియా చిత్రించగల అవకాశం లేదు కదా! తక్కిన ప్రక్రియలు ఏవైనా సమాజపు ఒడిదుడుకుల ఒక పార్శ్వాన్ని, ఒక ప్రబల సమస్యను మాత్రమే చిత్రించగల సామర్థ్యం మాత్రమే చూపగలవు. కథ విషయం అటువంటిది కాదు. సమగ్ర, సంపూర్ణ మానవసమాజాన్ని కథ ఆవిష్కరించగలదు. కథలో పల్లె జీవ సాక్షాత్కార పాత్రలు నాటకం, నాటిక, నవల వంటి వచన ప్రక్రియలలో చూపగలిగిన అవి వస్త్వాశ్రయాలు మాత్రమే కాగలవుకాని, ఆత్మాశ్రయాలు కావు. హృదయదఘ్నమైన అనుభూతులను కథ ఆవిష్కరించినంతగా మరి ఏ ఇతర సృజనాత్మక సాహిత్య ప్రక్రియ ఆవిష్కరించటం కుదరదేమో!                        ఈ కథా సంకలనం వల్ల తెలుగు కథ వస్తు రూప శిల్ప వికాసం, పరిణామ క్రమం కూడా అవగతమవుతుంది. నూరేళ్ళనాటి కథా రచనా వస్తువు లేవిధంగా ఉండేవో ఈ సంకలనం స్పష్టం చేస్తుంది.

Features

  • : Toli Malitaram Telugu Kathalu
  • : Dr Akkiraju Ramapathirao
  • : Bommidala Srikrishna Murthy Foundation
  • : MANIMN0108
  • : Paperback
  • : 2018
  • : 388
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Toli Malitaram Telugu Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam