చిన్నప్పుడు నాకు లెక్కలు అంటే భయం. ఒక్కొక్క క్లాసు అత్తెసరు మార్కులతో పాస్ అవుతూ ఉండే వాడిని. ఎమ్మెస్సీ అయి లెక్చరర్ అయిన తరువాత లైబ్రరీలో ఎన్ సైక్లోపీడియా బ్రిటానికాలో మొదటి సారిగా చిక్కు లెక్కలు చూడటం తటస్థించింది. అప్పటి నుంచి లెక్కలు అంటే కుతూహలం పుట్టుకు వచ్చింది. మా పిల్లలు ఎంట్రెన్సు పరీక్షకు తయారు అవుతున్నప్పుడు వారి పుస్తకాలు చూస్తే, అందులో కొన్ని తమాషా లెక్కలు ఉన్నాయి, వాటిలో కొన్నింటిని నేను సొంతంగానే సమాధానాలు కనుక్కొగాలిగాను.
మరికొన్నిటికి మా కళాశాల గణితశాస్త్ర ఉపన్యాసకుడు ముద్దులపల్లి సుబ్రహ్మణ్యం కు చూపించినప్పుడు కొన్నిటికి చేసి పెట్టాడు. కొన్నిటికి సాల్వు చేయవలసిన పద్ధతులు చెప్పాడు. అప్పుడు తెలిసింది ఏ లెక్కను ఎట్లా చెయ్యాలో అప్పటి నుంచి ఆసక్తి పెరిగింది. ఈ పుస్తకంలో కొన్నిటిని శకుంతలా దేవి పుస్తకం నుంచి తీసుకున్నా. ఏ లెక్కలు అన్నింటినీ యథాతథంగా ఉంచకుండా తగిన మార్పులు చేసి కథలు అల్లాను.
- ప్రయాగ కృష్ణమూర్తి
చిన్నప్పుడు నాకు లెక్కలు అంటే భయం. ఒక్కొక్క క్లాసు అత్తెసరు మార్కులతో పాస్ అవుతూ ఉండే వాడిని. ఎమ్మెస్సీ అయి లెక్చరర్ అయిన తరువాత లైబ్రరీలో ఎన్ సైక్లోపీడియా బ్రిటానికాలో మొదటి సారిగా చిక్కు లెక్కలు చూడటం తటస్థించింది. అప్పటి నుంచి లెక్కలు అంటే కుతూహలం పుట్టుకు వచ్చింది. మా పిల్లలు ఎంట్రెన్సు పరీక్షకు తయారు అవుతున్నప్పుడు వారి పుస్తకాలు చూస్తే, అందులో కొన్ని తమాషా లెక్కలు ఉన్నాయి, వాటిలో కొన్నింటిని నేను సొంతంగానే సమాధానాలు కనుక్కొగాలిగాను. మరికొన్నిటికి మా కళాశాల గణితశాస్త్ర ఉపన్యాసకుడు ముద్దులపల్లి సుబ్రహ్మణ్యం కు చూపించినప్పుడు కొన్నిటికి చేసి పెట్టాడు. కొన్నిటికి సాల్వు చేయవలసిన పద్ధతులు చెప్పాడు. అప్పుడు తెలిసింది ఏ లెక్కను ఎట్లా చెయ్యాలో అప్పటి నుంచి ఆసక్తి పెరిగింది. ఈ పుస్తకంలో కొన్నిటిని శకుంతలా దేవి పుస్తకం నుంచి తీసుకున్నా. ఏ లెక్కలు అన్నింటినీ యథాతథంగా ఉంచకుండా తగిన మార్పులు చేసి కథలు అల్లాను. - ప్రయాగ కృష్ణమూర్తి
© 2017,www.logili.com All Rights Reserved.