వీరు నిజాయతి, నిబద్ధత గల రచయిత, క్షుద్ర,పాపులారిటీ సాహిత్యోత్పత్తిలో అడుగు
పెట్టకుండా - సామాజిక ప్రయోజన దృష్టి తోనూ, బాలల మనో చైతన్యకారక విధంగానూ సాహిత్యాన్ని సృష్టిస్తున్న అరుదైన సృజనకారుల
మొదటి పంక్తిలో నిలబెట్టదగిన మంచి సృజనకారులు కృష్ణమూర్తిగారు.
రోజు రోజుకి శిధిలమైపోతున్న గ్రామీణ జీవిత చిత్రణ ప్రధానంగా సాగే వీరి 'జీవిత చిత్రం' కథల సంపుటిలోని కథలు గొప్ప కథల స్థాయికి తీసిపోని కథలు. కాటి కాపరుల కాటక జీవితాలు, పాములు ఆడించి జీవించే యానాదుల వ్యధాభరిత బతుకులు, పాలకుల ఫలహీన పథకాలతో, పస్తులుండలేక పశువులను కబేళాకు అమ్మేసుకునే గ్రామీణ బతుకు చిత్రికలు. 1988 నించి కథలు రాసిన అద్భుత కథకులు కృష్ణమూర్తి గారు. అందుకే వీరి రచనల పైన కొన్ని విశ్వ విద్యాలయాలలో పరిశోధనలు కూడా సాగుతున్నాయి. వీరిలో ఉన్న విశేషమేమిటంటే ఎంతో గాఢత కలిగిన సాంఘిక గాథల్ని, ఎంత నైపుణ్యంతో చిత్రిస్తారో, అంతటి నిపుణతతోనే జానపద గాథల్ని సంతరించగలరు. దానికి నిదర్శనంగా నిలిచినవే ఈ బేతాళ కథలు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సమాజాన్ని ఆనంద డోలికల్లో ఊపి, ఆలోచనామృతాన్ని ప్రసాదిస్తూ వస్తున్న జానపద సాహిత్య సంస్కృతి సారళ్య సంపద సరళి ఆగిపోలేదని, దానికింకా విలువ కొనసాగు తోందని, నిరూపించిన కథలు ఈ బేతాళ కథలు. ఎప్పుడో నిలిచిపోయిందనుకున్న ఈ రకపు సాహిత్యానికి కొనసాగింపుగా నిలిచే.............
వీరు నిజాయతి, నిబద్ధత గల రచయిత, క్షుద్ర,పాపులారిటీ సాహిత్యోత్పత్తిలో అడుగు పెట్టకుండా - సామాజిక ప్రయోజన దృష్టి తోనూ, బాలల మనో చైతన్యకారక విధంగానూ సాహిత్యాన్ని సృష్టిస్తున్న అరుదైన సృజనకారుల మొదటి పంక్తిలో నిలబెట్టదగిన మంచి సృజనకారులు కృష్ణమూర్తిగారు. రోజు రోజుకి శిధిలమైపోతున్న గ్రామీణ జీవిత చిత్రణ ప్రధానంగా సాగే వీరి 'జీవిత చిత్రం' కథల సంపుటిలోని కథలు గొప్ప కథల స్థాయికి తీసిపోని కథలు. కాటి కాపరుల కాటక జీవితాలు, పాములు ఆడించి జీవించే యానాదుల వ్యధాభరిత బతుకులు, పాలకుల ఫలహీన పథకాలతో, పస్తులుండలేక పశువులను కబేళాకు అమ్మేసుకునే గ్రామీణ బతుకు చిత్రికలు. 1988 నించి కథలు రాసిన అద్భుత కథకులు కృష్ణమూర్తి గారు. అందుకే వీరి రచనల పైన కొన్ని విశ్వ విద్యాలయాలలో పరిశోధనలు కూడా సాగుతున్నాయి. వీరిలో ఉన్న విశేషమేమిటంటే ఎంతో గాఢత కలిగిన సాంఘిక గాథల్ని, ఎంత నైపుణ్యంతో చిత్రిస్తారో, అంతటి నిపుణతతోనే జానపద గాథల్ని సంతరించగలరు. దానికి నిదర్శనంగా నిలిచినవే ఈ బేతాళ కథలు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సమాజాన్ని ఆనంద డోలికల్లో ఊపి, ఆలోచనామృతాన్ని ప్రసాదిస్తూ వస్తున్న జానపద సాహిత్య సంస్కృతి సారళ్య సంపద సరళి ఆగిపోలేదని, దానికింకా విలువ కొనసాగు తోందని, నిరూపించిన కథలు ఈ బేతాళ కథలు. ఎప్పుడో నిలిచిపోయిందనుకున్న ఈ రకపు సాహిత్యానికి కొనసాగింపుగా నిలిచే.............© 2017,www.logili.com All Rights Reserved.