నది ఎక్కడో కొండ మీద పుడుతుంది. పుట్టిన ప్రతి నదీ సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్లి అందులో కలిసిపోతుంది. పుట్టినప్పుడు ఆ నది చిన్నధార. కిందికి జరుతున్నప్పుడు ధార విశాలమవుతుంది. ఏ నదీ తిన్నగా వెళ్ళదు. ఎన్నో మలుపులు తిరుగుతుంది. మద్యలో ఎండుతుంది; మళ్లి నిండుతుంది. సుడులు తిరుగుతుంది, లోలోతుల పెరుగుతుంది. కండలరావు అనే ఈ మనిషి జీవితం కూడా అంతే. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మలుపులు తిరిగి తిరిగి, సుడుల్లో చిక్కుకుని లోతుల్లో ఇరుక్కుని మంజీర నది ఒడ్డుకి చేరుకున్నాడు. జీవిత పయనం ఒక మహా ప్రవాహం. ఐదో క్లాసు చదువుతున్నప్పుడు చిన్న వేషంతో రంగస్ధలం ఎక్కాడు; ప్రోత్సాహం లభించింది. ఎన్నో నాటకాలు వేశాడు. నాటకాలు సినిమాలకి తీసుకెళ్లాయి. ఎన్నో సినిమాలు. పదిహేనో ఏట చిన్నరచన చేశాడు. ప్రోత్సాహం లభించింది. రచనలు ఆరంభించాడు. కధలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, వ్యంగ్యాలు, సినిమా వ్యాసాలు, సినిమా రచనలు ఎన్నో. ఏది రాదు, నేర్చుకోలేదు, ఇక్కడ అభ్యసించలేదు. ఉత్సాహం, ఆసక్తి ఈ రెండే గురువులు. పెద్దల ఆశిస్సులు, మహనీయుల ప్రోత్సాహాలూ ముందుకు నడిపించాయి. ఆ అనుభవాల ప్రోదికే ఈ మంజీర వరకు
రావి కొండలరావు
నది ఎక్కడో కొండ మీద పుడుతుంది. పుట్టిన ప్రతి నదీ సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్లి అందులో కలిసిపోతుంది. పుట్టినప్పుడు ఆ నది చిన్నధార. కిందికి జరుతున్నప్పుడు ధార విశాలమవుతుంది. ఏ నదీ తిన్నగా వెళ్ళదు. ఎన్నో మలుపులు తిరుగుతుంది. మద్యలో ఎండుతుంది; మళ్లి నిండుతుంది. సుడులు తిరుగుతుంది, లోలోతుల పెరుగుతుంది. కండలరావు అనే ఈ మనిషి జీవితం కూడా అంతే. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మలుపులు తిరిగి తిరిగి, సుడుల్లో చిక్కుకుని లోతుల్లో ఇరుక్కుని మంజీర నది ఒడ్డుకి చేరుకున్నాడు. జీవిత పయనం ఒక మహా ప్రవాహం. ఐదో క్లాసు చదువుతున్నప్పుడు చిన్న వేషంతో రంగస్ధలం ఎక్కాడు; ప్రోత్సాహం లభించింది. ఎన్నో నాటకాలు వేశాడు. నాటకాలు సినిమాలకి తీసుకెళ్లాయి. ఎన్నో సినిమాలు. పదిహేనో ఏట చిన్నరచన చేశాడు. ప్రోత్సాహం లభించింది. రచనలు ఆరంభించాడు. కధలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, వ్యంగ్యాలు, సినిమా వ్యాసాలు, సినిమా రచనలు ఎన్నో. ఏది రాదు, నేర్చుకోలేదు, ఇక్కడ అభ్యసించలేదు. ఉత్సాహం, ఆసక్తి ఈ రెండే గురువులు. పెద్దల ఆశిస్సులు, మహనీయుల ప్రోత్సాహాలూ ముందుకు నడిపించాయి. ఆ అనుభవాల ప్రోదికే ఈ మంజీర వరకు రావి కొండలరావు© 2017,www.logili.com All Rights Reserved.