ఒకప్పుడు బ్రహ్మజ్ఞానానికి అంకితమైనవారు, మూడు రోజులు గ్రాసం కన్నా ఇంట్లో నిలవ వేసుకోరాదని భావించి బ్రతికేవారు. వారికీ తినటానికి ఉన్నదో లేదో, పస్తులు పడుకోవలసి వస్తున్నడేమౌనని సమాజం గమనిస్తుండేది.
భౌతిక జీవనానికై బ్రహ్మజ్ఞాభిలాషి ఎలా పేర్చకూడదని నిశ్చయించుకున్నాడో, అలాగే భౌతికకేతర జీవనంలో కూడా, అనగా మానసిక ఆధ్యాత్మిక జీవనంలో కూడా, అతడు కూర్చడం పేర్చడం చేసేవాడు కాదు.
నిత్య జీవనంలో తనకి ఎవరి ద్వారా ఏ రకమైన "గాయం" జరిగినా, వారిని కసరక, నిందించక, హాని తల పెట్టక, ద్వేషం ఉంచుకోక, క్షమించడానికి వేగిరపడుతుంటాడు. తనకిలోకంలో ఏది సంభవించినా, అది ఆ " మహాశక్తి" అజ్ఞానుసారమే జరుగుతున్నదని నమ్మినవాడు కాబట్టి విడిగా ఏ ప్రాణిని నిందించడు. కక్షనూ, ద్వేషాన్ని, ప్రతీకారేచ్ఛను, కీడు జరగాలనే భావననూ మనసులో కూర్చడు, పెర్చడు.