1895 లో మదనపల్లిలో జన్మించిన కృష్ణముర్తి దాదాపు 60 సంవత్సరాలు అనన్యమైన తీరుతో ప్రసంగిస్తూ ప్రపంచమంతటా పర్యటించిన విశ్వవిఖ్యాత తాత్త్వికుడు. తనను తాను తెలుసుకొనే సత్యాన్వేషణే మానవునికి స్వేచ్చను ప్రసాదించి నవ్య నూతన సమాజాన్ని ఆవిర్భవింపజేస్తుందని బోధించారు. సత్యాన్ని చేరడానికి ఏ మతాల, సంస్థల, గురువుల తోడ్పాటు అవసరం లేదని వక్కాణించారు. 1940-50 లలో యూరప్, అమెరికా, ఇండియాలలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు కృష్ణమూర్తిని కలిసి సంభాషించిన వారి ఇంటర్వ్యూలను కొన్నింటిని ఈ బృహత్ సంపుటిలో పొందుపరిచాము.
కృష్ణమూర్తిని చూడగానే మనలాంటివారే ఎందరో తమ సమస్యలను చెప్పుకునేవారు. తమ సందేహాలను, ఆశానిరాశలను, తమ అంతరంగపు అగాధాలలోని అనేక అంశాలను ఏ దాపరికమూ, సంకోచమూ లేకుండా వ్యక్తీకరించేవారు. కృష్ణమూర్తి వారి నిగూఢమైన అంతరంగపు లోతులను తరచి శోధించి తేటతెల్లం చేసిన ఉదంతాలు ఈ పుస్తకంలో పొందుపరచి ఉన్నాయి. అదే కృష్ణమూర్తి బోధనలలోని విశిష్ట సారాంశం. అపారమైన అంతర్దృష్టి, అపూర్వమైన రచనాశైలిలో సాగిన ఈ రచనలు, చదివినవారిని చైతన్యవంతులను చేస్తాయి. ప్రతి పాఠకునికీ ఎక్కడో ఒకచోట తనని తాను అద్దంలో చూసుకున్నట్లు అనిపించడం తథ్యం.
1895 లో మదనపల్లిలో జన్మించిన కృష్ణముర్తి దాదాపు 60 సంవత్సరాలు అనన్యమైన తీరుతో ప్రసంగిస్తూ ప్రపంచమంతటా పర్యటించిన విశ్వవిఖ్యాత తాత్త్వికుడు. తనను తాను తెలుసుకొనే సత్యాన్వేషణే మానవునికి స్వేచ్చను ప్రసాదించి నవ్య నూతన సమాజాన్ని ఆవిర్భవింపజేస్తుందని బోధించారు. సత్యాన్ని చేరడానికి ఏ మతాల, సంస్థల, గురువుల తోడ్పాటు అవసరం లేదని వక్కాణించారు. 1940-50 లలో యూరప్, అమెరికా, ఇండియాలలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు కృష్ణమూర్తిని కలిసి సంభాషించిన వారి ఇంటర్వ్యూలను కొన్నింటిని ఈ బృహత్ సంపుటిలో పొందుపరిచాము. కృష్ణమూర్తిని చూడగానే మనలాంటివారే ఎందరో తమ సమస్యలను చెప్పుకునేవారు. తమ సందేహాలను, ఆశానిరాశలను, తమ అంతరంగపు అగాధాలలోని అనేక అంశాలను ఏ దాపరికమూ, సంకోచమూ లేకుండా వ్యక్తీకరించేవారు. కృష్ణమూర్తి వారి నిగూఢమైన అంతరంగపు లోతులను తరచి శోధించి తేటతెల్లం చేసిన ఉదంతాలు ఈ పుస్తకంలో పొందుపరచి ఉన్నాయి. అదే కృష్ణమూర్తి బోధనలలోని విశిష్ట సారాంశం. అపారమైన అంతర్దృష్టి, అపూర్వమైన రచనాశైలిలో సాగిన ఈ రచనలు, చదివినవారిని చైతన్యవంతులను చేస్తాయి. ప్రతి పాఠకునికీ ఎక్కడో ఒకచోట తనని తాను అద్దంలో చూసుకున్నట్లు అనిపించడం తథ్యం.© 2017,www.logili.com All Rights Reserved.