అనాది నుండి ఈనాటి వరక్కూడా స్ర్తీని పురుషుడు తనతో సమానమైన జీవిగా చూడలేకపోయాడు. స్ర్తీని ఓ పిల్లల్ని కనే యంత్రంగానో, తన సెక్స్ కోరికల్ని తీరుస్తూ తనకు ఎన్నో సేవలు చేసే ఒక సాధనంగానో పురుషుడు స్ర్తీని చూశాడు - భోజనం పెట్టేటప్పుడు తల్లిగానూ, పని చేసేటప్పుడు దాసిగానూ, పడక గదిలో రంభగానూ స్ర్తీ ఉండాలని మన పెద్దలు చెప్పారు.
మరి పురుషులు స్ర్తీ పట్ల ఎలా ఉండాలో చెప్పిన దాఖలాలేవీ లేవు - స్త్రీ బాల్యంలో తండ్రి నీడలో, యౌవనంలో భర్త నీడలో, వృద్ధాప్యంలో కన్నకొడుకుల నీడలో బతకాలే తప్ప స్త్రీ స్వతంత్రంగా బతకడానికి అర్హురాలు కాదని హిందూధర్మాన్ని నిర్దేశించిన మను ధర్మశాస్త్రం చెప్పింది - స్త్రీ మనస్సు చంచల మనీ, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమనీ, నవ్వే ఆడదాన్నీ, ఏడ్చే మగవాన్ని నమ్మకూడదనీ, స్త్రీని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడ్తుందనీ, మగవాడు తిరక్క చెడితే ఆడది తిరిగి చెడ్తుందనీ - ఇలా పురుషులు స్త్రీలను గురించి ఎన్నో సామేతల్నీ, సాధారణీకాలనీ సృష్టించి సమాజంలో ఆమె స్థానాన్ని కేవలం వంటింటికీ, పడక గదికి మాత్రమే పరిమితం చేశారు.
మన పురుషాధిక్య సమాజంలో స్త్రీ పట్ల చూపబడుతున్న ఈ వివక్షను కవిత్వీకరించాడు డా ఎల్ ఎస్ ఆర్ ప్రసాద్. ఆయన కవిత్వం చదివితే స్త్రీ పట్ల మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు మారుతాయి.
అనాది నుండి ఈనాటి వరక్కూడా స్ర్తీని పురుషుడు తనతో సమానమైన జీవిగా చూడలేకపోయాడు. స్ర్తీని ఓ పిల్లల్ని కనే యంత్రంగానో, తన సెక్స్ కోరికల్ని తీరుస్తూ తనకు ఎన్నో సేవలు చేసే ఒక సాధనంగానో పురుషుడు స్ర్తీని చూశాడు - భోజనం పెట్టేటప్పుడు తల్లిగానూ, పని చేసేటప్పుడు దాసిగానూ, పడక గదిలో రంభగానూ స్ర్తీ ఉండాలని మన పెద్దలు చెప్పారు. మరి పురుషులు స్ర్తీ పట్ల ఎలా ఉండాలో చెప్పిన దాఖలాలేవీ లేవు - స్త్రీ బాల్యంలో తండ్రి నీడలో, యౌవనంలో భర్త నీడలో, వృద్ధాప్యంలో కన్నకొడుకుల నీడలో బతకాలే తప్ప స్త్రీ స్వతంత్రంగా బతకడానికి అర్హురాలు కాదని హిందూధర్మాన్ని నిర్దేశించిన మను ధర్మశాస్త్రం చెప్పింది - స్త్రీ మనస్సు చంచల మనీ, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమనీ, నవ్వే ఆడదాన్నీ, ఏడ్చే మగవాన్ని నమ్మకూడదనీ, స్త్రీని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడ్తుందనీ, మగవాడు తిరక్క చెడితే ఆడది తిరిగి చెడ్తుందనీ - ఇలా పురుషులు స్త్రీలను గురించి ఎన్నో సామేతల్నీ, సాధారణీకాలనీ సృష్టించి సమాజంలో ఆమె స్థానాన్ని కేవలం వంటింటికీ, పడక గదికి మాత్రమే పరిమితం చేశారు. మన పురుషాధిక్య సమాజంలో స్త్రీ పట్ల చూపబడుతున్న ఈ వివక్షను కవిత్వీకరించాడు డా ఎల్ ఎస్ ఆర్ ప్రసాద్. ఆయన కవిత్వం చదివితే స్త్రీ పట్ల మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు మారుతాయి.© 2017,www.logili.com All Rights Reserved.