దేశ భాషల్లో చదివేదానికీ చెప్పేదానికీ ఉన్న తేడాను సంస్కరించడానికి చేసిన ప్రయత్నాల్లో నుంచి పుట్టుకొచ్చిన వివాద౦ వ్యవహారిక భాషావాదం.
ఈవాదం మోసులెత్తిన దగ్గర నుంచి తెలుగు భాష, మోడరన్ తెలుగు, నవీనాంధ్రం, స్పష్టభాష, వ్యవహారిక భాష, వాడుక భాష, కొత్త తెలుగు, ఆధునిక తెలుగు, వర్తమానాంధ్రం, నేటి తెలుగు అనే కొత్త తొడుగు తొడుక్కుంది. అందువల్ల ఈ వాదాన్ని 'ఆధునిక భాషా వాదం', నవీన భాషా వాదం, వర్తమానాంధ్ర భాషా వాదం, వ్యవహారికతా వాదం, వ్యవహారిక భాషా వాదం, వాడుక భాషా వాదం అనే పేర్లతో పిలుచుకుంటున్నారు. ఇది కేవలం వచన రచనకు సంబందంచిన వాదం కాబట్టి 'ఆధునిక రచన వచనా వాదం' అనీ అన్నారు.
ఈ భాషా ఉద్యమం మంచి ఊపందుకుంటున్న తరుణంలో ప్రతివాదులకు ప్రతి సమాధానంగా రూపుదిద్దుకున్న వ్యాకరణం ఈ నవీనాంధ్ర వ్యాకరణం (1913 - 1914). దీనికి ముఖ్యంగా "గ్రామ్య భాషా వాదం, 'స్తా' భాషా వాదం" అనే అవహేళనలు స్పూర్తిదాయకాలు.
- డా దావులూరి కృష్ణకుమారి
దేశ భాషల్లో చదివేదానికీ చెప్పేదానికీ ఉన్న తేడాను సంస్కరించడానికి చేసిన ప్రయత్నాల్లో నుంచి పుట్టుకొచ్చిన వివాద౦ వ్యవహారిక భాషావాదం. ఈవాదం మోసులెత్తిన దగ్గర నుంచి తెలుగు భాష, మోడరన్ తెలుగు, నవీనాంధ్రం, స్పష్టభాష, వ్యవహారిక భాష, వాడుక భాష, కొత్త తెలుగు, ఆధునిక తెలుగు, వర్తమానాంధ్రం, నేటి తెలుగు అనే కొత్త తొడుగు తొడుక్కుంది. అందువల్ల ఈ వాదాన్ని 'ఆధునిక భాషా వాదం', నవీన భాషా వాదం, వర్తమానాంధ్ర భాషా వాదం, వ్యవహారికతా వాదం, వ్యవహారిక భాషా వాదం, వాడుక భాషా వాదం అనే పేర్లతో పిలుచుకుంటున్నారు. ఇది కేవలం వచన రచనకు సంబందంచిన వాదం కాబట్టి 'ఆధునిక రచన వచనా వాదం' అనీ అన్నారు. ఈ భాషా ఉద్యమం మంచి ఊపందుకుంటున్న తరుణంలో ప్రతివాదులకు ప్రతి సమాధానంగా రూపుదిద్దుకున్న వ్యాకరణం ఈ నవీనాంధ్ర వ్యాకరణం (1913 - 1914). దీనికి ముఖ్యంగా "గ్రామ్య భాషా వాదం, 'స్తా' భాషా వాదం" అనే అవహేళనలు స్పూర్తిదాయకాలు. - డా దావులూరి కృష్ణకుమారి© 2017,www.logili.com All Rights Reserved.