జాతీయాలు తెలుగు నుడి సొగసులో భాగం. వేల ఏళ్ల చరిత్ర, వారసత్వం ఉన్న తెలుగు జాతి అనేక కారణాల వల్ల చెల్లా చెదురు అయినా, అందరిని కలిపి ఉంచేవి వారి నోట పలికే నుడికారాలే. తెలుగు నుడికారాన్ని బలంగా, చెక్కు చెదరకుండా కాపాడే చేవ జాతీయాలకు ఉంది. తెలుగువారి నోళ్ళలో నుంచి ఊడిపడుతూ ఉన్న జాతీయాలను ఏరుకొచ్చి, వాటిలో నుంచి 'తేట తెలుగు' జాతీయాలను వడకట్టి పోగు పోస్తే ఇప్పటికి 17వేలు దాటాయి. ఇంకా ఎన్ని ఉంటాయో తెలియదుకానీ, తెలుగు నుడి చరిత్రలో ఇప్పటికి ఇదే అతి పెద్ద ఏరిపోత. ఈ తెలుగు సంపదను నలు చేరుగులా వెదజల్లే ఉపన్యాసకులకు, రచయితలకు, టీవి - ప్రింటు మీడియా పాత్రికేయులకు, సినీ రచయితలకు ఇది చేతికగా ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దిన పొత్తం ఇది.
జాతీయాలు తెలుగు నుడి సొగసులో భాగం. వేల ఏళ్ల చరిత్ర, వారసత్వం ఉన్న తెలుగు జాతి అనేక కారణాల వల్ల చెల్లా చెదురు అయినా, అందరిని కలిపి ఉంచేవి వారి నోట పలికే నుడికారాలే. తెలుగు నుడికారాన్ని బలంగా, చెక్కు చెదరకుండా కాపాడే చేవ జాతీయాలకు ఉంది. తెలుగువారి నోళ్ళలో నుంచి ఊడిపడుతూ ఉన్న జాతీయాలను ఏరుకొచ్చి, వాటిలో నుంచి 'తేట తెలుగు' జాతీయాలను వడకట్టి పోగు పోస్తే ఇప్పటికి 17వేలు దాటాయి. ఇంకా ఎన్ని ఉంటాయో తెలియదుకానీ, తెలుగు నుడి చరిత్రలో ఇప్పటికి ఇదే అతి పెద్ద ఏరిపోత. ఈ తెలుగు సంపదను నలు చేరుగులా వెదజల్లే ఉపన్యాసకులకు, రచయితలకు, టీవి - ప్రింటు మీడియా పాత్రికేయులకు, సినీ రచయితలకు ఇది చేతికగా ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దిన పొత్తం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.