చరిత్ర సృష్టించిన ప్రతి వ్యక్తిలో విశేషంగా కన్పించేది అతని వ్యక్తిత్వమే. అటుపోట్లు వచ్చినా చెక్కుచెదరక ముందుకు సాగిపోయేవారే ధీరచిత్తులు, వారి వారి సిద్ధాంతాల అమలుకు జీవితాన్ని కూడా బలిపెట్టారు. కాని వెనుకకు మరల లేదు. బుద్ధుడు మొదలుకొని గాంథీ, అంబేద్కర్, నేతాజీ వరకు అదే పోరాట పంథా, ప్రతి మనిషి జన్మించగానే గొప్ప ఇంట్లో, బంగారు చెంచాతో పుట్టరు. కష్టాలు, కన్నీళ్ళు కలబోసుకుని జీవితసారాన్ని వడబోసుకుని ఒడిదుడుకుల ప్రవాహంతో ఎదురీది ఒక సుస్థిర స్థానాన్ని సంపాదిస్తారు. అలా సాధించిందే విజయం. అయితే ఎప్పుడూ సమాజంలోని కొన్ని వ్యతిరేక శక్తులు ఈ మంచి వ్యక్తులను ఎదుర్కోటానికే ప్రయత్నిస్తుంటారు.
ఎన్టీఆర్ ను తీసుకుంటే ఆయనకు నచ్చినవిధంగా తన జీవితాన్ని నిర్ణయించుకోకూడదనేదే ఇక్కడ శాసనం. అదే ఇంట్లో ఎన్టీఆర్ చివరి కుమార్తె మొదటి వివాహం భగ్నమైతే ఆమె జీవితం మోడు కాకూడదని, ఎన్టీఆర్ మరో వివాహం చేసారు. అలాగే కొడుకు విషయంలో కూడా ఆయన ఉదారంగా ప్రవర్తించారు.
- డా. నందమూరి లక్ష్మీపార్వతి