అందమైన చట్టాలను నమ్ముకొని నష్టపోయామా అన్న ప్రశ్న ఆదివాసులు ఇవ్వాళ వేసుకుంటున్నారు. నిజానికి తప్పు అక్కడ లేదు. చట్టం వచ్చేసింది కాబట్టి ఇంకా రాజకీయ సమీకరణ అక్కరలేదన్న నిర్లక్ష్యంలో ఉంది. మనది ప్రాథమికంగా నిజాయితీలేని పాలనా వ్యవస్థ. ప్రజల ఒత్తిడికి, ప్రజాతంత్ర ఉద్యమాల ఒత్తిడికి తలొగ్గి చట్టాలు చేస్తుందిగానీ అవి అమలు కాకుండా ఉండడానికి ఎంత చెయ్యాలో అంతా చేస్తుంది. అందువల్ల ప్రజల వైపు నుండి రాజకీయ ఒత్తిడి కొనసాగడం అవసరం. కమ్యూనిస్టుల వంటి రాజకీయశక్తులు చట్టాలనూ వాటి అమలునూ అసలే పట్టించుకోకుండా ఒక రకంగా నష్టం చేస్తే, ఎన్జీవోలు వచ్చి చట్టం ఉంటే ఇంక రాజకీయ ఉద్యమాలెందుకు అని అటువైపు నుండి అంతే పొరపాటు చేస్తున్నాయి.
సమస్యలను వెలికి తీయడం కోసమే కాక వాటి పరిష్కారం కోసం కూడా పని చేసేవారికి కొంతకాలానికి విపరీతమైన విసుగు వస్తుంది. ఏ ప్రయత్నమూ ముందుకు నడవదు, ఏ పరిష్కారమూ సాఫీగా సాగాడు. కాగితం మీద చదువుకున్నప్పుడు స్పష్టంగా కనిపించే చట్టాలు అమలు దాకా వచ్చేసరికి అయోమయంగా, అస్పష్టంగా కనిపిస్తాయి. చూస్తుండగానే వాటిలో కొన్ని వాక్యాలు అర్థాన్ని మార్చేసుకుంటాయి. లేని పదాలు వచ్చి కూర్చుంటాయి. ఉన్నవి మాయమవుతాయి. చట్టాలు చేసే వారి లక్ష్యమేమిటో గానీ వాటి నుండి హక్కులు పొందాలని చూసేవారికి అవి ఒక రకంగా కనిపిస్తాయి, వాటిని అమలు చేయవలసిన ప్రభుత్వ అధికారులకు అవి ఇంకొక రకంగా కనిపిస్తాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విహంగవీక్షణానికి అంబానీ సోదరుల ఆస్తి తగాదా, మారేడుమిల్లిలో గిరిజన - గిరిజనేతరుల ఆస్తి తగాదా రెండూ ఒకే తీరుగా కనిపిస్తాయి. రెంటికీ వారు వర్తింపజేసే సూత్రం ఒకటే.
- కె బాలగోపాల్
అందమైన చట్టాలను నమ్ముకొని నష్టపోయామా అన్న ప్రశ్న ఆదివాసులు ఇవ్వాళ వేసుకుంటున్నారు. నిజానికి తప్పు అక్కడ లేదు. చట్టం వచ్చేసింది కాబట్టి ఇంకా రాజకీయ సమీకరణ అక్కరలేదన్న నిర్లక్ష్యంలో ఉంది. మనది ప్రాథమికంగా నిజాయితీలేని పాలనా వ్యవస్థ. ప్రజల ఒత్తిడికి, ప్రజాతంత్ర ఉద్యమాల ఒత్తిడికి తలొగ్గి చట్టాలు చేస్తుందిగానీ అవి అమలు కాకుండా ఉండడానికి ఎంత చెయ్యాలో అంతా చేస్తుంది. అందువల్ల ప్రజల వైపు నుండి రాజకీయ ఒత్తిడి కొనసాగడం అవసరం. కమ్యూనిస్టుల వంటి రాజకీయశక్తులు చట్టాలనూ వాటి అమలునూ అసలే పట్టించుకోకుండా ఒక రకంగా నష్టం చేస్తే, ఎన్జీవోలు వచ్చి చట్టం ఉంటే ఇంక రాజకీయ ఉద్యమాలెందుకు అని అటువైపు నుండి అంతే పొరపాటు చేస్తున్నాయి. సమస్యలను వెలికి తీయడం కోసమే కాక వాటి పరిష్కారం కోసం కూడా పని చేసేవారికి కొంతకాలానికి విపరీతమైన విసుగు వస్తుంది. ఏ ప్రయత్నమూ ముందుకు నడవదు, ఏ పరిష్కారమూ సాఫీగా సాగాడు. కాగితం మీద చదువుకున్నప్పుడు స్పష్టంగా కనిపించే చట్టాలు అమలు దాకా వచ్చేసరికి అయోమయంగా, అస్పష్టంగా కనిపిస్తాయి. చూస్తుండగానే వాటిలో కొన్ని వాక్యాలు అర్థాన్ని మార్చేసుకుంటాయి. లేని పదాలు వచ్చి కూర్చుంటాయి. ఉన్నవి మాయమవుతాయి. చట్టాలు చేసే వారి లక్ష్యమేమిటో గానీ వాటి నుండి హక్కులు పొందాలని చూసేవారికి అవి ఒక రకంగా కనిపిస్తాయి, వాటిని అమలు చేయవలసిన ప్రభుత్వ అధికారులకు అవి ఇంకొక రకంగా కనిపిస్తాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విహంగవీక్షణానికి అంబానీ సోదరుల ఆస్తి తగాదా, మారేడుమిల్లిలో గిరిజన - గిరిజనేతరుల ఆస్తి తగాదా రెండూ ఒకే తీరుగా కనిపిస్తాయి. రెంటికీ వారు వర్తింపజేసే సూత్రం ఒకటే. - కె బాలగోపాల్© 2017,www.logili.com All Rights Reserved.