పోలీస్ స్టేషన్ రికార్డులు
ఈ పుస్తకము ప్రతీ పోలీసు స్టేసన్లోనూ ఉంచి జనరల్ డైరీని వ్రాయుటకు ముందు ఆ రోజు పోలీస్ స్టేసన్లో హజరుగా ఉన్న సిబ్బంది, ఇతర డ్యూటీలలో ఉ న్న సిబ్బంది, నియమించబడిన డ్యూటీలను అందు నమోదు చేసి తదుపరి జనరల్ డైరీ నందు వ్రాయుదురు.
ప్రతీ పోలీస్ స్టేషన్లోనూ ఫారం 92లో ఒక డైరీని వ్రాయవలెను. ఇందు 24 గంటలు ప్రతీ రోజు పనికాలమును క్రమముగా వ్రాయవలెను. ఈ జనరల్ డైరీని కార్బన్ పెట్టి కాపీయింగ్ పెన్సిల్తో వ్రాయవలెను. సాధారణముగా ఈ జనరల్ డైరీని ఉదయం 7 గం||ల నుండి మరుచటి రోజు ఉదయం 7 గం||ల వరకు వ్రాయబడును. ఒక్కొక్కపుడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఈ జనరల్ డైరీని అచ్చటి పరిస్థితులను బట్టి ఎపుడు మొదలు పెట్టవలసినది, ఎపుడు ముగించవలసినదీ నిర్ధారించవచ్చును. జనరల్ డైరీని ప్రారంభించిన మొదట ఈ విషయములను కాలానుక్రమముగా వ్రాయవలెను.
© 2017,www.logili.com All Rights Reserved.