జగద్గురు శ్రీ కల్యాణా నంద భారతీ మాంతాచార్య మహాస్వామి వారు అక్షర దర్శనమ్ అనే గ్రంథాన్ని 18 సూత్రాలలో సంస్కృతంలో రచించారు. సూత్రమనగా అల్పాక్షరములలో అనల్పార్థ రచనగా నిర్వచింపవచ్చును.
అని సూత్ర లక్షణము. సూత్రములో చెప్పబడిన విషయ మతిక్లుప్తముగా ఏ విధమైన సంశయములకు తావీయనిదిగా, హృద్యమైనదిగాను, సర్వజనామోద యోగ్యమైనది గాను, ఏ విధముగను తిరస్కరింప శక్యముకానిదిగా ఉండవలెనని తాత్పర్యము. ఇవి సంప్రదాయ విదులగు బ్రహ్మర్షులు చే వారి పవిత్రమైన ఆలోచన సరణిని జిజ్ఞాసువులైన సాధకులకు మార్గనిర్దేశము చేయుటకు ప్రతిపాదించబడినవి.
దీనికి బ్రహ్మశ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు 'లోచన' మను వ్యాఖ్యానాన్ని సంస్కృతంలో రచించారు. ఆ వ్యాఖ్యానం చూస్తుంటే పైన చెప్పబడిన సుత్రార్థ నిర్వచనం అక్షరాలా సరిపోతుంది.
- వారణాసి వేంకటేశ్వర్లు