ఆర్టిస్టు, క్రిటిక్కు - ఒక బెస్ట్ సెల్లరు
పుస్తకాన్ని పాఠకులు ఎలా చదువుతారనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా "No two persons ever read the same book" అని ఎడ్మండ్ విల్సన్ అన్న వాక్యాల్ని తరచూ గుర్తుచేస్తూ ఉంటారు. "లోకో భిన్న రుచి " అంటారు కాబట్టి ఒక పుస్తకం బెస్ట్ సెల్లర్ అయినప్పటికీ అది అందరికీ నచ్చాలన్న నియమమేమీ లేదు. అదే విధంగా ఒక బెస్ట్ సెల్లర్ నచ్చనంత మాత్రాన ఆ సదరు పాఠకుడికి ఆ రచనను ఆస్వాదించే, అర్థంచేసుకునే స్థాయి లేదనుకోవడం కూడా అవివేకం క్రిందకి వస్తుంది. 'కళాతపస్వి' తీసిన కళాఖండాలు సైతం విమర్శకులకు మినహాయింపు కాదు. ఒక కళాకారుడు తన కళను నలుగురిలో ప్రదర్శనకు పెట్టినప్పుడే పాఠకులకూ / ప్రేక్షకులకూ దాని మంచి-చెడులనూ, నాణ్యతనూ విశ్లేషిస్తూ ప్రశంసో, విమర్శో చేసే హక్కును తన చేతుల్తో తానే స్వయంగా కట్టబెడతాడు. అలా కాకుండా తన కళకు ఎవరూ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడానికి అర్హులు కాదనే నిశ్చితాభిప్రాయం ఉన్నవాళ్ళు పోర్చుగీసు రచయిత ఫెర్నాండో పెస్సోవా లాంటివాళ్ళ దారిలో జాగ్రత్తగా తమ రచనల్ని ట్రంకు పెట్టెల్లో భద్రపరుచుకోవడం ఉత్తమం. వ్యక్తిగత విమర్శలూ, దూషణలూ కానంతవరకూ ఒక రచన మీద ప్రశంసలనూ, విమర్శలనూ సమానంగా స్వీకరించగలిగే మానసిక సంసిద్ధత కళాకారుల్లో ఉండవలసిన ముఖ్య లక్షణం. ఏదైనా రచన నచ్చకపోవడాన్నీ, దాన్ని విమర్శించడాన్నీ రసాస్వాదన చెయ్యలేని...............
© 2017,www.logili.com All Rights Reserved.