ప్రపంచ వాజ్మయంలో మధుర భక్తి భావ బంధుర కావ్యం 'గీతాంజలి'. అసలు కవిత్వం ఆత్మాశ్రయమని, వస్త్వాశ్రయమని రెండు విధాలు. ఏదైనా ఒక కథా వస్తువును ఆశ్రయించి కథ, పాత్రలు, సంఘటనలు, వర్ణనలు, మొదలైనవాటితో ఒప్పి ఉండే రచనను వస్త్వాశ్రయం అంటారు. కేవలం కవి భావాలు మాత్రం వ్యక్తీకరిస్తే, అంటే కవి అనుభవాలు, అనుభూతులు, భగవంతుని తోడి సంభాషణలు కవి తన గుండెను కుదిలించి, భగవంతుని మ్రోల కుప్పపోసి, ఆర్తితో, ముకుళిత హస్తాలతో, ప్రార్థించే విధానమే ఆత్మాశ్రయ కవిత్వం. తెలుగు సాహిత్య రంగంలో భక్తి శతకాలాన్నీ, ఈ ఆత్మాశ్రయ కవితాశాఖకు చెందినవే. భగవంతునితో తన మనస్సు విప్పి చెప్పుకునే స్థితి, తన భావాలన్నీ మాలికలల్లి, భగవంతుని మెడలో అలంకరించే స్థితి, ఈ ఆత్మాశ్రయ కవితా విధానంలో ఉన్న మేలుగతులు.
- కె. మలయవాసిని
ప్రపంచ వాజ్మయంలో మధుర భక్తి భావ బంధుర కావ్యం 'గీతాంజలి'. అసలు కవిత్వం ఆత్మాశ్రయమని, వస్త్వాశ్రయమని రెండు విధాలు. ఏదైనా ఒక కథా వస్తువును ఆశ్రయించి కథ, పాత్రలు, సంఘటనలు, వర్ణనలు, మొదలైనవాటితో ఒప్పి ఉండే రచనను వస్త్వాశ్రయం అంటారు. కేవలం కవి భావాలు మాత్రం వ్యక్తీకరిస్తే, అంటే కవి అనుభవాలు, అనుభూతులు, భగవంతుని తోడి సంభాషణలు కవి తన గుండెను కుదిలించి, భగవంతుని మ్రోల కుప్పపోసి, ఆర్తితో, ముకుళిత హస్తాలతో, ప్రార్థించే విధానమే ఆత్మాశ్రయ కవిత్వం. తెలుగు సాహిత్య రంగంలో భక్తి శతకాలాన్నీ, ఈ ఆత్మాశ్రయ కవితాశాఖకు చెందినవే. భగవంతునితో తన మనస్సు విప్పి చెప్పుకునే స్థితి, తన భావాలన్నీ మాలికలల్లి, భగవంతుని మెడలో అలంకరించే స్థితి, ఈ ఆత్మాశ్రయ కవితా విధానంలో ఉన్న మేలుగతులు. - కె. మలయవాసిని© 2017,www.logili.com All Rights Reserved.