రెండు రాష్ట్రాలలోనూ వెలికి రాని, ముద్రితం కాని తాళపత్ర, రాతప్రతులు తెలుగులోనూ, ఇతర బాషలలో ఎన్నెన్నో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగువారు చారిత్రకంగా నివసించి, సాహిత్యం సృష్టించిన ఇతర రాష్ట్రాలలోని గ్రంథాలయాలలో కూడా ఎంతో విలువైన సాహిత్యం ఇంకా మరుగున పడే ఉంది. చాలా సమాచారం పాశ్చాత్యుల సేకరణలో విదేశీ గ్రంథాలయాలలో కూడా ఉంది. వీటన్ని౦టినీ సేకరించి, ముద్రించి, పరిశోధనలను విస్తృతం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వాలూ, పరిశోధకులూ, అన్ని రంగాల సంస్థలూ చేపట్టాలని కోరుతున్నాం. ప్రభుత్వాలు ఇలాంటి పరిశోధనలను ప్రోత్సహిస్తే, ఇంకా చిక్కువీడని తెలుగుభాషా చరిత్రల అనేక ప్రశ్నలకు జవాబులు దొరికే అవకాసం ఉంది.
ఈ సంపుటి వెలికితేవడంలో మా కృషికి ఎందరెందరో చేయి కలిపారు. వారిలో కొందరు ప్రధానమైన వారికి విడిగా ఒక పేజీలో కృతఙ్ఞతలు తెలియజేస్తున్నప్పటికీ, అందులో చేరిన, చేరని అనేకమంది మా కృషికి చేయూతనూ, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
- ఉషాదేవి అయినవోలు
రెండు రాష్ట్రాలలోనూ వెలికి రాని, ముద్రితం కాని తాళపత్ర, రాతప్రతులు తెలుగులోనూ, ఇతర బాషలలో ఎన్నెన్నో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగువారు చారిత్రకంగా నివసించి, సాహిత్యం సృష్టించిన ఇతర రాష్ట్రాలలోని గ్రంథాలయాలలో కూడా ఎంతో విలువైన సాహిత్యం ఇంకా మరుగున పడే ఉంది. చాలా సమాచారం పాశ్చాత్యుల సేకరణలో విదేశీ గ్రంథాలయాలలో కూడా ఉంది. వీటన్ని౦టినీ సేకరించి, ముద్రించి, పరిశోధనలను విస్తృతం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వాలూ, పరిశోధకులూ, అన్ని రంగాల సంస్థలూ చేపట్టాలని కోరుతున్నాం. ప్రభుత్వాలు ఇలాంటి పరిశోధనలను ప్రోత్సహిస్తే, ఇంకా చిక్కువీడని తెలుగుభాషా చరిత్రల అనేక ప్రశ్నలకు జవాబులు దొరికే అవకాసం ఉంది. ఈ సంపుటి వెలికితేవడంలో మా కృషికి ఎందరెందరో చేయి కలిపారు. వారిలో కొందరు ప్రధానమైన వారికి విడిగా ఒక పేజీలో కృతఙ్ఞతలు తెలియజేస్తున్నప్పటికీ, అందులో చేరిన, చేరని అనేకమంది మా కృషికి చేయూతనూ, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాం. - ఉషాదేవి అయినవోలు
© 2017,www.logili.com All Rights Reserved.