"మన జీవన విధానం ఎలా ఉండాలంటే అది మనకు శాంతిని ప్రసాదించాలి. మన ఉనికిని స్థిరంగా ఉంచాలి. మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొకూడదు. మన వివేకాన్ని వృద్ధి చేయాలి.
ప్రతి జీవికి ఒక జీవితం వుంది. అవి తమ శత్రువుల నుంచి రక్షించుకోటానికి ప్రయత్నిస్తాయి. జీవితమంటేనే పోరాటాలమయం."
జ్ఞానమనేది ఒక తృష్ణ. ఒక తపన. తనని తాను తెలుసుకోవటమే జ్ఞానం. మనకు కొన్ని బలహీనతలున్నాయి. అవి అంతఃశత్రువులు. పైకి కనిపించవు. వాటినెలా జయించటం? మనస్సుని నిగ్రహించి అదుపులో ఉంచుకోగలిగితే చాలు, సగం సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి.
మనం కోరుకునే ప్రశాంతత మార్కెట్లో దొరుకుతుందా? మనమే సృష్టించుకోవాలి. జీవితాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలి. నీకు ఏ మందివ్వాలో నీ గురువుకి తెలుసు. అంటే నీకొక మార్గాన్ని నిర్దేశించగలడు. ఆపైన నీ స్వయంకృషే."
మన సంస్కృతీ "గంగాలహరి" ద్వారా ఆవిస్క్రుతించారు మూర్తి.
గంగాలహరి కధానాయిక ఎక్కడో అమెరికాలోని ఫ్లారిడాలో పుట్టి పెరిగిన సోనియా ఎన్నో కష్టాలను అనుభవించి "గుడ్ సమారిటన్స్" సలహాలతో మనశ్శాంతి కోసమే కాశి వస్తుంది. అక్కడ మనశ్శాంతిని పొందుతుంది. వైదికధర్మ విశిష్టతాను తెలుసుకుంటుంది. భారతవనితగా అందులో తెనుగువనితగా పరిణామము చెంది ఒక సదాచార కుటుంబానికి కోడలు అవుతుంది. ఇదే ఈ నవలలో ప్రధాన కధాంశము.
మూర్తిగారు కాశి ఆలయములను గంగాఘాటులను మనమనోనేత్రానికి చూపించారు.
- ఎన్.ఎస్.ఆర్. మూర్తి.
"మన జీవన విధానం ఎలా ఉండాలంటే అది మనకు శాంతిని ప్రసాదించాలి. మన ఉనికిని స్థిరంగా ఉంచాలి. మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొకూడదు. మన వివేకాన్ని వృద్ధి చేయాలి. ప్రతి జీవికి ఒక జీవితం వుంది. అవి తమ శత్రువుల నుంచి రక్షించుకోటానికి ప్రయత్నిస్తాయి. జీవితమంటేనే పోరాటాలమయం." జ్ఞానమనేది ఒక తృష్ణ. ఒక తపన. తనని తాను తెలుసుకోవటమే జ్ఞానం. మనకు కొన్ని బలహీనతలున్నాయి. అవి అంతఃశత్రువులు. పైకి కనిపించవు. వాటినెలా జయించటం? మనస్సుని నిగ్రహించి అదుపులో ఉంచుకోగలిగితే చాలు, సగం సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. మనం కోరుకునే ప్రశాంతత మార్కెట్లో దొరుకుతుందా? మనమే సృష్టించుకోవాలి. జీవితాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుకోవాలి. నీకు ఏ మందివ్వాలో నీ గురువుకి తెలుసు. అంటే నీకొక మార్గాన్ని నిర్దేశించగలడు. ఆపైన నీ స్వయంకృషే." మన సంస్కృతీ "గంగాలహరి" ద్వారా ఆవిస్క్రుతించారు మూర్తి. గంగాలహరి కధానాయిక ఎక్కడో అమెరికాలోని ఫ్లారిడాలో పుట్టి పెరిగిన సోనియా ఎన్నో కష్టాలను అనుభవించి "గుడ్ సమారిటన్స్" సలహాలతో మనశ్శాంతి కోసమే కాశి వస్తుంది. అక్కడ మనశ్శాంతిని పొందుతుంది. వైదికధర్మ విశిష్టతాను తెలుసుకుంటుంది. భారతవనితగా అందులో తెనుగువనితగా పరిణామము చెంది ఒక సదాచార కుటుంబానికి కోడలు అవుతుంది. ఇదే ఈ నవలలో ప్రధాన కధాంశము. మూర్తిగారు కాశి ఆలయములను గంగాఘాటులను మనమనోనేత్రానికి చూపించారు. - ఎన్.ఎస్.ఆర్. మూర్తి.© 2017,www.logili.com All Rights Reserved.