Title | Price | |
Think and Grow Rich | Rs.125 | In Stock |
Think And Grow Rich | Rs.125 | In Stock |
'మీ తలరాతకు కర్తలు మీరే. మీ పరిసరాలను, పరిస్థితులను మీరు ప్రభావితం చేయగలరు, నిర్దేశించగలరు, నియంత్రించగలరు. మీ జీవితాన్ని ఎలా కావాలనుకుంటే అలా మలచుకోగలరు. -
ఈ ప్రపంచం అక్షరరూపంలో అందుకున్న రచనల్లో 'సంకల్పించండి, సంపన్నులు కండి, అత్యంత స్ఫూర్తిదాయకమైనది, మీరు చదవగలిగే అవకాశమున్న అత్యంత ముఖ్యమైన ఆర్థిక రచనల్లో ఒకటి. 1937లో మొట్టమొదటిసారిగా ప్రచురించబడిన 'సంకల్పించండి, సంపన్నులు కండి, పుస్తకం, హిల్ రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందింది. అనేక తరాల పాఠకులకు స్ఫూర్తినిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది వ్యాపారనాయకులు తమకు విజయాలను అందించే తిరుగులేని ప్రణాళికలను రూపొందించుకొనేందుకు ఈ పుస్తకాన్ని వినియోగించుకున్నారు. అయితే ఈ పుస్తకాన్ని కేవలం ఆర్థికమైన సాధనకే పరిమితమైనదిగా చూడటం సరైనది కాదు. ఈ ప్రపంచంలో అన్ని రంగాల్లోని వ్యక్తులు కేవలం భౌతికమైన సంపదలే కాక, తాము చేయాలనుకున్న లేదా కోరుకున్న దేన్నైనా పొందేందుకు సహాయపడగలిగేలా రూపొందించబడటమే ఈ స్పూర్తిదాయక, వ్యక్తిత్వ వికాస రచన యొక్క అసలు బలం. “ఒక వ్యక్తి తన జీవితకాలంలో తప్పక చదవాల్సిన పుస్తకాలు' అనే పేరుతో జాన్ సి. మాక్స్ వెల్ సిద్ధం చేసిన జాబితాలో 'సంకల్పించండి, సంపన్నులు కండి' కూడా ఉంది. 'బిజినెస్ వీక్' పత్రిక 'అత్యధికంగా అమ్ముడుపోయిన
పుస్తకాల జాబితాలో మొట్టమొదటిసారి చోటుచేసుకున్నాక చాలా ఏళ్ల తర్వాత కూడా ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాల జాబితాలో ఆరోస్థానంలో నిలిచింది."
© 2017,www.logili.com All Rights Reserved.