'ఘంటసాల నవరత్న గానమాలిక' నామకరణము చాలా దివ్యముగానున్నది. ఘంటసాల వారి సంగీత సముద్రములో, మునిగి తేలుతూ, జీవితమును సాగించుకున్న శ్రీయుతులు బి. ఎ. నారాయణగారు అట్టడుగు వరకు శోధించి, సాధించిన ఈ నవరత్నములు అపూర్వము, అనన్యము, అద్భుతము. నవరత్నములకు రూప గుణములు, ఫలితములు తెలుసుకొని, ధరించి, మేలు పొందునట్లు గాక ఈ నవరత్నములకు రుచులు కూడా కలవు. ఆస్వాదించి, ఫలితములు పొందవచ్చు. నవరసభరితమగు ఈ ఆలోచన ఘంటసాల గురువుగారే బి. ఎ. నారాయణగారికి కలిగించారనుటలో సందేహము లేదు. త్యాగరాజ స్వామీ పంచరత్నముల వలె, శాశ్వతమై, ప్రయోజనాత్మకమై సంగీత ప్రపంచమందు సుస్థిర స్థానములను సాధించి, బహుశ్రమతో సలిపిన సాధన సఫలమగుగాక.
'ఘంటసాల నవరత్న గానమాలిక' నామకరణము చాలా దివ్యముగానున్నది. ఘంటసాల వారి సంగీత సముద్రములో, మునిగి తేలుతూ, జీవితమును సాగించుకున్న శ్రీయుతులు బి. ఎ. నారాయణగారు అట్టడుగు వరకు శోధించి, సాధించిన ఈ నవరత్నములు అపూర్వము, అనన్యము, అద్భుతము. నవరత్నములకు రూప గుణములు, ఫలితములు తెలుసుకొని, ధరించి, మేలు పొందునట్లు గాక ఈ నవరత్నములకు రుచులు కూడా కలవు. ఆస్వాదించి, ఫలితములు పొందవచ్చు. నవరసభరితమగు ఈ ఆలోచన ఘంటసాల గురువుగారే బి. ఎ. నారాయణగారికి కలిగించారనుటలో సందేహము లేదు. త్యాగరాజ స్వామీ పంచరత్నముల వలె, శాశ్వతమై, ప్రయోజనాత్మకమై సంగీత ప్రపంచమందు సుస్థిర స్థానములను సాధించి, బహుశ్రమతో సలిపిన సాధన సఫలమగుగాక.© 2017,www.logili.com All Rights Reserved.