పాట పాడడం తెలియదు
పాట రాయడం తెలియదు
కాని -
పాటంటే 'ఘంటసాల'ని తెలుసు
ఘంటసాలంటే 'పాట'ని తెలుసు
పాటకు ఘంటసాల ప్రాణం
ఘంటసాల ప్రాణం పాటకు భావం
నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో
సప్తస్వరాలు మునుగితేలాయి ఆ గానసంద్రంలో
కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని
కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ
ఎందుకంటే-
ఆ కంఠం అమృతం
ఆ గానం అమృతం
ఆ పాట అమృతం
ఆ భావం అమృతం
అతడే గానామృత భాండం
అందులోనుండి జాలువారిన 555 అమృతపు చుక్కలే
ఈ ఘంటసాల 'పాట'శాల
అకారాదిక్రమంలో అమర్చబడ్డాయి.
అయిదుసెకన్లలో చేరుకోవచ్చు ఏ పాటనైనా
ఆస్వాదించండి.
- సి హెచ్ రామారావు
పాట పాడడం తెలియదు పాట రాయడం తెలియదు కాని - పాటంటే 'ఘంటసాల'ని తెలుసు ఘంటసాలంటే 'పాట'ని తెలుసు పాటకు ఘంటసాల ప్రాణం ఘంటసాల ప్రాణం పాటకు భావం నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో సప్తస్వరాలు మునుగితేలాయి ఆ గానసంద్రంలో కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ ఎందుకంటే- ఆ కంఠం అమృతం ఆ గానం అమృతం ఆ పాట అమృతం ఆ భావం అమృతం అతడే గానామృత భాండం అందులోనుండి జాలువారిన 555 అమృతపు చుక్కలే ఈ ఘంటసాల 'పాట'శాల అకారాదిక్రమంలో అమర్చబడ్డాయి. అయిదుసెకన్లలో చేరుకోవచ్చు ఏ పాటనైనా ఆస్వాదించండి. - సి హెచ్ రామారావు© 2017,www.logili.com All Rights Reserved.