1980 తర్వాత తెలుగునేల సామాజిక రంగాల్లో మహిళా చైతన్యం బలపడింది. మహిళలు కుటుంబం సామాజిక సమస్యలను అధిగమిస్తూనే విద్య, ఉపాధి రంగాల్లో బలపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలపై సాగుతున్న అత్యాచారాలు, హత్యలు, వరకట్నపు వేధింపులు, కుటుంబ హింస చర్చనీయాంశాలయ్యాయి. అమితంగా మహిళా సంఘాలు ఏర్పడి మహిళా సమస్యల పట్ల సమావేశాలు జరపడం, మహిళలపై సాగుతున్న ఆకృత్యాలను నిరసించడం, బాధితుల తరపున పోరాడటం, వారికి న్యాయం జరిగేలా చూడటంతో పాటు ఈ పురుషాధిక్య సమాజంలో వారు కోల్పోతున్న హక్కులను పసిగట్టడం లాంటివి జరిగాయి. ఈ పుస్తకంలో తెలుగునేలతో పాటు జాతీయంగా, అంతర్జాతీయంగా వచ్చిన స్త్రీల పరిణామాలు కన్పిస్తాయి. గ్రామీణ మహిళలు సైతం ఆర్థికంగా ఎదగాలని, స్వయంకృషితో జీవించాలని, సగటుమగవాడి నుండి స్వేచ్ఛ పొందాలని స్త్రీ పురుష అసమానతలు లేని నవసమాజం నిర్మింపబడాలని. అదే మానవప్రగతికి దోహద పడుతుందనే అంతరార్థాన్ని ఈ సంకలనం అందిస్తుంది.
1980 తర్వాత తెలుగునేల సామాజిక రంగాల్లో మహిళా చైతన్యం బలపడింది. మహిళలు కుటుంబం సామాజిక సమస్యలను అధిగమిస్తూనే విద్య, ఉపాధి రంగాల్లో బలపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలపై సాగుతున్న అత్యాచారాలు, హత్యలు, వరకట్నపు వేధింపులు, కుటుంబ హింస చర్చనీయాంశాలయ్యాయి. అమితంగా మహిళా సంఘాలు ఏర్పడి మహిళా సమస్యల పట్ల సమావేశాలు జరపడం, మహిళలపై సాగుతున్న ఆకృత్యాలను నిరసించడం, బాధితుల తరపున పోరాడటం, వారికి న్యాయం జరిగేలా చూడటంతో పాటు ఈ పురుషాధిక్య సమాజంలో వారు కోల్పోతున్న హక్కులను పసిగట్టడం లాంటివి జరిగాయి. ఈ పుస్తకంలో తెలుగునేలతో పాటు జాతీయంగా, అంతర్జాతీయంగా వచ్చిన స్త్రీల పరిణామాలు కన్పిస్తాయి. గ్రామీణ మహిళలు సైతం ఆర్థికంగా ఎదగాలని, స్వయంకృషితో జీవించాలని, సగటుమగవాడి నుండి స్వేచ్ఛ పొందాలని స్త్రీ పురుష అసమానతలు లేని నవసమాజం నిర్మింపబడాలని. అదే మానవప్రగతికి దోహద పడుతుందనే అంతరార్థాన్ని ఈ సంకలనం అందిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.