డాక్టర్ చిత్తర్వు మధు వృత్తిరీత్యా వైద్యులు. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాదులో కన్సల్టెంట్ ఫిజిషియన్ గా ప్రాక్టీసు చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు. అప్పటి నుంచి కథలు, నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతూనే ఉన్నాయి. మెడికల్ సైన్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ నవలలు ఐసిసియు, బై బై పొలోనియా, ఎపిడెమిక్ నవలలు ఒక నవలాత్రయంగా రాశారు. స్పేస్ ఓపెరా అనబడే ఒక సైన్స్ ఫిక్షన్ ప్రక్రియలో 'కుజుడి కోసం' అనే నవల రచన మాసపత్రికలో సీరియల్ గా ప్రచురితం అయింది. దానికి కొనసాగింపు 'నీలి ఆకుపచ్చ' కనిగె జాలపత్రికలో సీరియల్ గా వచ్చింది.
గ్రహాంతర ప్రయాణాలు, సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు, ప్రేమలు భవిష్యత్ లో జరిగినట్లు కథనం స్పేస్ ఒపేరా లక్షణాలు. ఈ రెండు నవలలు ఆంగ్లంలో మొదటగా ప్రచురించబడ్డాయి. వీటిని రచయిత స్వంతంగా తెలుగులోకి అనువాదం చేశారు. భవిష్యత్ నాలుగో సహస్రాబ్దిలో సాగే కథనం జరగబోయే శాస్త్రీయ పురోగతిని వివరిస్తూ హనీ ఆమ్రపాలి అనే హీరో భూమికి కుజుడి నుంచి తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. కుజుడి వర్ణం అరుణం అయితే ప్రాణవాయువు పాత్రహరితం చూస్తే కన్పించే రంగులు అవే. ఉత్కంఠ కలిగించే ఈ నవల మిమ్మల్ని మరో భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకుని వెళుతుంది.
డాక్టర్ చిత్తర్వు మధు వృత్తిరీత్యా వైద్యులు. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాదులో కన్సల్టెంట్ ఫిజిషియన్ గా ప్రాక్టీసు చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు. అప్పటి నుంచి కథలు, నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడుతూనే ఉన్నాయి. మెడికల్ సైన్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ నవలలు ఐసిసియు, బై బై పొలోనియా, ఎపిడెమిక్ నవలలు ఒక నవలాత్రయంగా రాశారు. స్పేస్ ఓపెరా అనబడే ఒక సైన్స్ ఫిక్షన్ ప్రక్రియలో 'కుజుడి కోసం' అనే నవల రచన మాసపత్రికలో సీరియల్ గా ప్రచురితం అయింది. దానికి కొనసాగింపు 'నీలి ఆకుపచ్చ' కనిగె జాలపత్రికలో సీరియల్ గా వచ్చింది. గ్రహాంతర ప్రయాణాలు, సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు, ప్రేమలు భవిష్యత్ లో జరిగినట్లు కథనం స్పేస్ ఒపేరా లక్షణాలు. ఈ రెండు నవలలు ఆంగ్లంలో మొదటగా ప్రచురించబడ్డాయి. వీటిని రచయిత స్వంతంగా తెలుగులోకి అనువాదం చేశారు. భవిష్యత్ నాలుగో సహస్రాబ్దిలో సాగే కథనం జరగబోయే శాస్త్రీయ పురోగతిని వివరిస్తూ హనీ ఆమ్రపాలి అనే హీరో భూమికి కుజుడి నుంచి తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. కుజుడి వర్ణం అరుణం అయితే ప్రాణవాయువు పాత్రహరితం చూస్తే కన్పించే రంగులు అవే. ఉత్కంఠ కలిగించే ఈ నవల మిమ్మల్ని మరో భవిష్యత్ ప్రపంచంలోకి తీసుకుని వెళుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.