కొండల మీద ఎక్కడో ఓ నది సన్నని ధారలాగా మొదలై ప్రవహిస్తూ ఇంకా ఇంకా విశాలమై సముద్రాన్ని తలపించినట్టు - ఈ 'అమృతవాహిని' అనే నవల ఓ చిన్న కుటుంబంతో మొదలై, అమెరికాని చుట్టబెట్టి విశ్వవ్యాప్తమవుతుంది. ఆ సన్నని ధార పేరు మంజరి. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని తల్లికి తోడై, తండ్రికి 'నమ్మక'మై, అత్యాశకుపోయే అక్కకు చక్కని జీవితాన్ని ప్రసాదించి, పుట్టినింటా, మెట్టినింటా తలలో నాలుకై పయనిస్తూ మారే పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మలుచుకుంటూ నిండు గోదావరిలా ప్రవహించిన 'మంజరి' కథ ఖచ్చితంగా పాఠకుడి మనసుకి హత్తుకోవడమే కాక, కలకాలం నిలిచిపోతుంది.
'నిన్ను నేను చదివిస్తా.. నువ్వు మరొకర్ని చదివించాలి' అనే మాట కొంచెం 'ఠాకూర్' కథని ఓ క్షణం జ్ఞప్తికి తెచ్చినా, మరుక్షణమే మరో మలుపు మనని కథలోకి లాక్కుపోతుంది. ఒక పురుషుడి దృష్టిలో లోకం వేరు. స్త్రీ దృష్టిలో వేరు. ఆ స్త్రీ సంపూర్ణ స్త్రీత్వం కలిగిన అమ్మ అయినప్పుడు ఆమె దృష్టిలోని లోకం ఎలా ఉంటుందో ఈ 'అమృతవాహిని' నవల మనకి కళ్ళకి కట్టినట్టు చెబుతుంది.
కొండల మీద ఎక్కడో ఓ నది సన్నని ధారలాగా మొదలై ప్రవహిస్తూ ఇంకా ఇంకా విశాలమై సముద్రాన్ని తలపించినట్టు - ఈ 'అమృతవాహిని' అనే నవల ఓ చిన్న కుటుంబంతో మొదలై, అమెరికాని చుట్టబెట్టి విశ్వవ్యాప్తమవుతుంది. ఆ సన్నని ధార పేరు మంజరి. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని తల్లికి తోడై, తండ్రికి 'నమ్మక'మై, అత్యాశకుపోయే అక్కకు చక్కని జీవితాన్ని ప్రసాదించి, పుట్టినింటా, మెట్టినింటా తలలో నాలుకై పయనిస్తూ మారే పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మలుచుకుంటూ నిండు గోదావరిలా ప్రవహించిన 'మంజరి' కథ ఖచ్చితంగా పాఠకుడి మనసుకి హత్తుకోవడమే కాక, కలకాలం నిలిచిపోతుంది. 'నిన్ను నేను చదివిస్తా.. నువ్వు మరొకర్ని చదివించాలి' అనే మాట కొంచెం 'ఠాకూర్' కథని ఓ క్షణం జ్ఞప్తికి తెచ్చినా, మరుక్షణమే మరో మలుపు మనని కథలోకి లాక్కుపోతుంది. ఒక పురుషుడి దృష్టిలో లోకం వేరు. స్త్రీ దృష్టిలో వేరు. ఆ స్త్రీ సంపూర్ణ స్త్రీత్వం కలిగిన అమ్మ అయినప్పుడు ఆమె దృష్టిలోని లోకం ఎలా ఉంటుందో ఈ 'అమృతవాహిని' నవల మనకి కళ్ళకి కట్టినట్టు చెబుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.