ఈ నవల గురించి చెప్పాలంటే గతంలో ఈ రకమైన ఊహకానీ, ఆలోచనకానీ ఎవరికీ రాలేదని నేనంటే అతిశయోక్తి కాదు. ఈ నవలలో నాయిక 'మానస' మంచి సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. మానస చదువుకునే రోజుల్లో మనోహర్ అనే వ్యక్తితో పరిచయమయ్యింది. కానీ ఆ పరిచయం చదువు పూర్తయిన తరువాత కొనసాగలేదు. మానసకు మహీధర్ తో వివాహం జరుగుతుంది. మానస, మహీధర్ ల ఏకైక సంతానం రవళి. ఆమెను ఎంతో అపురూపంగా పెంచుతారు ఆమె తల్లిదండ్రులు. రవళి కూడా ఎదిగేకొద్దీ తల్లిదండ్రులతో ఎంతో ఆనందంగా గడుపుతుంది. ఆమె ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్రణవ్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడి ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకునేంత సాన్నిహిత్యం పెరుగుతుంది.
మానస ఉమ్మడి కుటుంబం నుండి వచ్చింది. పిన్ని, బాబాయి, అన్నలు, వదినలతో చిన్నప్పుడు ఆనందమయమైన జీవితం ఆపైన పెళ్ళయ్యాక మహీధర్, రవళిలతో సుఖమయ జీవితం గడుపుతున్న ఆమె జీవితంలో ఒక అపశృతి దొర్లుతుంది. హఠాత్తుగా మానసకు జబ్బుచేసి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లడం డాక్టర్ ఆమెకు ప్రాణాంతక వ్యాధి ఉందని, ఆమె ఎక్కువకాలం జీవించదని చెప్పడం జరుగుతుంది. అప్పటినుంచి మహీధర్, రవళి చాలా కృంగిపోతారు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
కన్నాకూతురు తన తల్లి పట్ల చూపిన ప్రేమకు జోహార్లు. నాకు తెలిసి ఈ విధమైన ఇతివృత్తంలో నవలకానీ, కథకానీ చదివిన జ్ఞాపకం లేదు. ఏమైనా సుజల ఈ ప్రయత్నం, భావుకతా శతధా ప్రశంసనీయం. నిజంగా ఈ విధమైన కథావస్తువును ఎంచుకున్న ఆమె ఊహాశక్తి అద్భుతం. రాబోయే కాలంలో సుజల కలం నుండి మరెన్నో ఆణిముత్యాలు రావాలని మనసారా అభినందిస్తూ...
- హైమవతీ భీమన్న
ఈ నవల గురించి చెప్పాలంటే గతంలో ఈ రకమైన ఊహకానీ, ఆలోచనకానీ ఎవరికీ రాలేదని నేనంటే అతిశయోక్తి కాదు. ఈ నవలలో నాయిక 'మానస' మంచి సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. మానస చదువుకునే రోజుల్లో మనోహర్ అనే వ్యక్తితో పరిచయమయ్యింది. కానీ ఆ పరిచయం చదువు పూర్తయిన తరువాత కొనసాగలేదు. మానసకు మహీధర్ తో వివాహం జరుగుతుంది. మానస, మహీధర్ ల ఏకైక సంతానం రవళి. ఆమెను ఎంతో అపురూపంగా పెంచుతారు ఆమె తల్లిదండ్రులు. రవళి కూడా ఎదిగేకొద్దీ తల్లిదండ్రులతో ఎంతో ఆనందంగా గడుపుతుంది. ఆమె ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్రణవ్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడి ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకునేంత సాన్నిహిత్యం పెరుగుతుంది. మానస ఉమ్మడి కుటుంబం నుండి వచ్చింది. పిన్ని, బాబాయి, అన్నలు, వదినలతో చిన్నప్పుడు ఆనందమయమైన జీవితం ఆపైన పెళ్ళయ్యాక మహీధర్, రవళిలతో సుఖమయ జీవితం గడుపుతున్న ఆమె జీవితంలో ఒక అపశృతి దొర్లుతుంది. హఠాత్తుగా మానసకు జబ్బుచేసి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లడం డాక్టర్ ఆమెకు ప్రాణాంతక వ్యాధి ఉందని, ఆమె ఎక్కువకాలం జీవించదని చెప్పడం జరుగుతుంది. అప్పటినుంచి మహీధర్, రవళి చాలా కృంగిపోతారు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు. కన్నాకూతురు తన తల్లి పట్ల చూపిన ప్రేమకు జోహార్లు. నాకు తెలిసి ఈ విధమైన ఇతివృత్తంలో నవలకానీ, కథకానీ చదివిన జ్ఞాపకం లేదు. ఏమైనా సుజల ఈ ప్రయత్నం, భావుకతా శతధా ప్రశంసనీయం. నిజంగా ఈ విధమైన కథావస్తువును ఎంచుకున్న ఆమె ఊహాశక్తి అద్భుతం. రాబోయే కాలంలో సుజల కలం నుండి మరెన్నో ఆణిముత్యాలు రావాలని మనసారా అభినందిస్తూ... - హైమవతీ భీమన్న© 2017,www.logili.com All Rights Reserved.