బాలగొండ ఆంజనేయులు గారు తన మిత్రుడిచేత "అందాలు - భవబంధాలు" నవల వ్రాతప్రతి పంపి, ప్రచురణ కోసం దానిపై అభిప్రాయం అడిగినప్పుడు , ".. రచన బాగోలేకపోతే మొహమాటం లేకుండా ఆ విషయమే వ్రాస్తాననీ, దానికి సిద్ధపడితేనే నవల ఇమ్మనీ" అన్నాను. ఆయన దానికి అంగీకరించి ఇచ్చారు. అయితే, పది పేజీలు చదవగానే, ఇందులో కథాంశం వినూత్నంగా తోచింది. ఇంతవరకూ ఎవరూ స్పృశించని సబ్జెక్టును బాగా హాండిల్ చేశారు రచయిత. అమెరికా వ్యామోహంతో భార్య తప్పుచేస్తుంది అనిపించినా, ఆమె కూడా కరక్టే కదా అనిపిస్తుంది మరోవైపు. మాతృభూమిపై ప్రేమ, ఆధునిక జీవన విధానం పై ఆశ, రెంటిమధ్యా ఘర్షణల తాలూకు చిత్రణ బావుంది. చివర్లో ...అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. మొత్తంమీద బాగా చదివిస్తుంది.
- యండమూరి వీరేంద్రనాథ్
బాలగొండ ఆంజనేయులు గారు తన మిత్రుడిచేత "అందాలు - భవబంధాలు" నవల వ్రాతప్రతి పంపి, ప్రచురణ కోసం దానిపై అభిప్రాయం అడిగినప్పుడు , ".. రచన బాగోలేకపోతే మొహమాటం లేకుండా ఆ విషయమే వ్రాస్తాననీ, దానికి సిద్ధపడితేనే నవల ఇమ్మనీ" అన్నాను. ఆయన దానికి అంగీకరించి ఇచ్చారు. అయితే, పది పేజీలు చదవగానే, ఇందులో కథాంశం వినూత్నంగా తోచింది. ఇంతవరకూ ఎవరూ స్పృశించని సబ్జెక్టును బాగా హాండిల్ చేశారు రచయిత. అమెరికా వ్యామోహంతో భార్య తప్పుచేస్తుంది అనిపించినా, ఆమె కూడా కరక్టే కదా అనిపిస్తుంది మరోవైపు. మాతృభూమిపై ప్రేమ, ఆధునిక జీవన విధానం పై ఆశ, రెంటిమధ్యా ఘర్షణల తాలూకు చిత్రణ బావుంది. చివర్లో ...అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. మొత్తంమీద బాగా చదివిస్తుంది. - యండమూరి వీరేంద్రనాథ్© 2017,www.logili.com All Rights Reserved.