ప్రవేశిక
బహుముఖమైన మానవ జీవిత చిత్రణకు అనువైన ఆధునిక వచన సాహిత్య ప్రక్రియ 'నవల'. జీవితాన్ని సహజంగా చిత్రించి, వ్యాఖ్యానించటమేగాక, అందలి సమస్యల్ని చర్చించి, పరిష్కార మార్గాల్ని గూడా నవల చూపగలుగుతోంది. వ్యక్తి జీవితంలోనూ, సమాజంలోనూ వస్తున్న పరిణామాల్ని చక్కగా ప్రతిబింబిస్తూ, కొత్త కొత్త శిల్ప ధోరణుల్ని సంతరించుకుంటూ, 'నవల' నానాటికీ ఎదుగుతోంది. ఇట్లా ప్రజా జీవితానికి సన్నిహితంగా ఉంటున్నది కాబట్టే 'నవల' ఇతర సాహిత్య ప్రక్రియల కంటే అధికంగా ఆదరింపబడుతోంది.
తెలుగు నవలకు నూరేళ్లు దాటాయి. ఈ నూరేళ్ల పైచిలుకు కాలంలో వేల సంఖ్యలో నవలలు వెలువడ్డాయి. వీటిలో “యివీ మా తెలుగు నవలలు" అని తెలుగు జాతి చెప్పుకోదగ్గ స్థాయిలో గల ఉత్తమ నవలలు కొన్ని ఉన్నాయి. దీనిలో "మాలపల్లి, ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు..
తెలుగు నవలా సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని సాధించుకొన్న 'మాలపల్లి" పరామర్శకు "మాలపల్లి” రచయిత శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి జీవిత విశేషాలు, ఆనాటి మాలపల్లి ప్రచురణ, ఆదరణలకు సంబంధించిన విశేషాలు తెలిసి కోవడం అవసరం.
ఉన్నవ జీవిత విశేషాలు :
'మాలపల్లి' నవలా రచయిత, సుప్రసిద్ధ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యధులు, ఆంద్రోద్యమ సూత్రధారుల్లో ఒకరూ, శారదానికేతన సంస్థాపకులూ అయిన ఆ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు గుంటూరు జిల్లా వేములూరు పాడులో 1877 డిసెంబరు 4న జన్మించారు. (ఈశ్వర నామ సంవత్సర కార్తీక బహుళ 30, ప్రక్క గ్రామమైన 'అమినాబాదు'లో ప్రాథమిక విద్య అభ్యసించిన అనంతరం, గుంటూరు ఎ.ఇ.యల్.యమ్. కళాశాలలో యఫ్.ఎ. వరకు చదువుకొన్నారు. ఉపాధ్యాయుడుగా,..............
ప్రవేశిక బహుముఖమైన మానవ జీవిత చిత్రణకు అనువైన ఆధునిక వచన సాహిత్య ప్రక్రియ 'నవల'. జీవితాన్ని సహజంగా చిత్రించి, వ్యాఖ్యానించటమేగాక, అందలి సమస్యల్ని చర్చించి, పరిష్కార మార్గాల్ని గూడా నవల చూపగలుగుతోంది. వ్యక్తి జీవితంలోనూ, సమాజంలోనూ వస్తున్న పరిణామాల్ని చక్కగా ప్రతిబింబిస్తూ, కొత్త కొత్త శిల్ప ధోరణుల్ని సంతరించుకుంటూ, 'నవల' నానాటికీ ఎదుగుతోంది. ఇట్లా ప్రజా జీవితానికి సన్నిహితంగా ఉంటున్నది కాబట్టే 'నవల' ఇతర సాహిత్య ప్రక్రియల కంటే అధికంగా ఆదరింపబడుతోంది. తెలుగు నవలకు నూరేళ్లు దాటాయి. ఈ నూరేళ్ల పైచిలుకు కాలంలో వేల సంఖ్యలో నవలలు వెలువడ్డాయి. వీటిలో “యివీ మా తెలుగు నవలలు" అని తెలుగు జాతి చెప్పుకోదగ్గ స్థాయిలో గల ఉత్తమ నవలలు కొన్ని ఉన్నాయి. దీనిలో "మాలపల్లి, ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు.. తెలుగు నవలా సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని సాధించుకొన్న 'మాలపల్లి" పరామర్శకు "మాలపల్లి” రచయిత శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి జీవిత విశేషాలు, ఆనాటి మాలపల్లి ప్రచురణ, ఆదరణలకు సంబంధించిన విశేషాలు తెలిసి కోవడం అవసరం. ఉన్నవ జీవిత విశేషాలు : 'మాలపల్లి' నవలా రచయిత, సుప్రసిద్ధ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యధులు, ఆంద్రోద్యమ సూత్రధారుల్లో ఒకరూ, శారదానికేతన సంస్థాపకులూ అయిన ఆ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు గుంటూరు జిల్లా వేములూరు పాడులో 1877 డిసెంబరు 4న జన్మించారు. (ఈశ్వర నామ సంవత్సర కార్తీక బహుళ 30, ప్రక్క గ్రామమైన 'అమినాబాదు'లో ప్రాథమిక విద్య అభ్యసించిన అనంతరం, గుంటూరు ఎ.ఇ.యల్.యమ్. కళాశాలలో యఫ్.ఎ. వరకు చదువుకొన్నారు. ఉపాధ్యాయుడుగా,..............© 2017,www.logili.com All Rights Reserved.