మూడక్షరాల నవల ఒకటిన్నర శతాబ్దానికి చేరువౌతున్నా దానికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందరికి అనుభవమైన విషయాలే ఇలా వృత్తంలో ఇమిడ్చి, రచయిత ప్రతిభతో జోడించి, పురుడుపోస్తే, చదివే పాఠకుడు ఫిదా అయితీరుతాడు. ‘ఆ రాత్రి’ నవల ద్వారా పాఠకలోకానికి గతంలో సుపరిచితులైన శ్రీ సుందరరావు గారు మరల పాఠకలోకానికి అందించిన మరో నవల ‘అందీ అందని బంధం’. ఈ నవల్లో కథ పాతదే అయినా! కథనంలో రచయిత చూపించిన శ్రద్ధ కమనీయంగా కనిపిస్తుంది. రాంప్రకాష్ సైనబాల జీవితం మామిడి చెట్టుకు మాధవీ లతలా అల్లుకుపోయిన వైనాలు రచయిత చక్కగా చిత్రీకరించారు.
రాంప్రకాష్ జీవితం అనాధాశ్రమం నుండి ప్రారంభమై భార్యా పిల్లల్ని అనాధులు చేసి వెళ్ళేదాకా నవల్లో సంఘటనలు ఒక దానితో ఒకటి విడదీయలేనంత ఫ్యాన్సీగా అనిపిస్తాయి. రాంప్రకాష్ రమణల స్నేహం సమాజంలో ఇంకా మానవత్వం సజీవంగా ఉన్నదనడానికి నిదర్శనంగా నిలుస్తుంది.
మూడక్షరాల నవల ఒకటిన్నర శతాబ్దానికి చేరువౌతున్నా దానికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందరికి అనుభవమైన విషయాలే ఇలా వృత్తంలో ఇమిడ్చి, రచయిత ప్రతిభతో జోడించి, పురుడుపోస్తే, చదివే పాఠకుడు ఫిదా అయితీరుతాడు. ‘ఆ రాత్రి’ నవల ద్వారా పాఠకలోకానికి గతంలో సుపరిచితులైన శ్రీ సుందరరావు గారు మరల పాఠకలోకానికి అందించిన మరో నవల ‘అందీ అందని బంధం’. ఈ నవల్లో కథ పాతదే అయినా! కథనంలో రచయిత చూపించిన శ్రద్ధ కమనీయంగా కనిపిస్తుంది. రాంప్రకాష్ సైనబాల జీవితం మామిడి చెట్టుకు మాధవీ లతలా అల్లుకుపోయిన వైనాలు రచయిత చక్కగా చిత్రీకరించారు. రాంప్రకాష్ జీవితం అనాధాశ్రమం నుండి ప్రారంభమై భార్యా పిల్లల్ని అనాధులు చేసి వెళ్ళేదాకా నవల్లో సంఘటనలు ఒక దానితో ఒకటి విడదీయలేనంత ఫ్యాన్సీగా అనిపిస్తాయి. రాంప్రకాష్ రమణల స్నేహం సమాజంలో ఇంకా మానవత్వం సజీవంగా ఉన్నదనడానికి నిదర్శనంగా నిలుస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.