మానవజీవితం అంటేనే సామజిక జీవితం. పుట్టుక వ్యక్తిత్వం, విలువలు, సంస్కారాలు, ప్రమాణాలు, పెండ్లి, చావు ఇవన్నీ వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తాయి. జీవితంలో అవన్నీ మనందరం అనుభవిస్తున్నవే అయినా దాన్నీ ఒక కథగానో, నవలగానో చదివినప్పుడు మనకు కలిగే ఆ అనుభూతి మర్చిపోలేని ఓ అందమైన తీయని జ్ఞాపకం. దాన్ని 24 ఫ్రేమ్స్ లో చూస్తే అది సినిమానే అవుతుంది. ఆ అనుభూతిని ప్రత్యక్షంగా దర్శింపజేసింది "ఆ రాత్రి" నవల. నిజానికి ఈ నవలలోని కథా వస్తువుకు 'ఆ రాత్రి' అనే పేరు చక్కగా సరిపోయింది.
పల్లె జీవితంతో పాకులాట ప్రారంభమై, అనేక దశలు దాటి పరిభ్రమిస్తుంది. నిజానికి ఇది రంగయ్య కథ అయినా, దీనిలో మిగిలిన పాత్రలన్నీ ఔచిత్యం కల్గినవిగా దర్శనమిస్తాయి. బంగారమ్మ పెండ్లి ఘట్టం వర్ణన తీరు, రచయితకు గల పాటవానికి నిదర్శనంగా కన్పిస్తుంది. భాష పరంగా, కొన్ని దశాబ్దాల క్రితం వాడకంలో ఉన్నది కనిపిస్తుంది. ప్రతి పాత్ర క్రమశిక్షణలో వ్యవహరించడం ఈ నవలలో విశేషంగా కనిపిస్తుంది. ఈ నవలా రచయిత 'డి సుందరరావు' గారు తరాల అంతరాలను కథా నేపథ్యంగా ఈ నవలలో దర్శింపజేశారు.
మానవజీవితం అంటేనే సామజిక జీవితం. పుట్టుక వ్యక్తిత్వం, విలువలు, సంస్కారాలు, ప్రమాణాలు, పెండ్లి, చావు ఇవన్నీ వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తాయి. జీవితంలో అవన్నీ మనందరం అనుభవిస్తున్నవే అయినా దాన్నీ ఒక కథగానో, నవలగానో చదివినప్పుడు మనకు కలిగే ఆ అనుభూతి మర్చిపోలేని ఓ అందమైన తీయని జ్ఞాపకం. దాన్ని 24 ఫ్రేమ్స్ లో చూస్తే అది సినిమానే అవుతుంది. ఆ అనుభూతిని ప్రత్యక్షంగా దర్శింపజేసింది "ఆ రాత్రి" నవల. నిజానికి ఈ నవలలోని కథా వస్తువుకు 'ఆ రాత్రి' అనే పేరు చక్కగా సరిపోయింది. పల్లె జీవితంతో పాకులాట ప్రారంభమై, అనేక దశలు దాటి పరిభ్రమిస్తుంది. నిజానికి ఇది రంగయ్య కథ అయినా, దీనిలో మిగిలిన పాత్రలన్నీ ఔచిత్యం కల్గినవిగా దర్శనమిస్తాయి. బంగారమ్మ పెండ్లి ఘట్టం వర్ణన తీరు, రచయితకు గల పాటవానికి నిదర్శనంగా కన్పిస్తుంది. భాష పరంగా, కొన్ని దశాబ్దాల క్రితం వాడకంలో ఉన్నది కనిపిస్తుంది. ప్రతి పాత్ర క్రమశిక్షణలో వ్యవహరించడం ఈ నవలలో విశేషంగా కనిపిస్తుంది. ఈ నవలా రచయిత 'డి సుందరరావు' గారు తరాల అంతరాలను కథా నేపథ్యంగా ఈ నవలలో దర్శింపజేశారు.
© 2017,www.logili.com All Rights Reserved.