వందేళ్లక్రితం ప్రజలు మాట్లాడే భాషవేరు. గ్రంధాల్లో భాష వేరు. వ్యావహారిక భాషలో పుస్తకాలు వ్రాయడం ఒక పెద్ద తప్పుగా కూడా భావించేవారు. అటువంటి సమయంలో వాడుక భాషలో, ఇంట్లో పని పాటలలో అలసిపొయ్యే సామాన్య స్త్రీ జనం సైతం స్వయంగా చదువుకొని ఆనందించగల చిన్న చిన్న నవలలు వ్రాసిన సనాతులతో శతపోరు సలిపి, చివరికి పండిత వ్రకాండులతో సైతం "భేష్" అనిపించుకున్న రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు. గ్రాంధిక భాషావల్ల సామాన్య ప్రజలకు లోపిస్తున్న సాహితి పిపాసను, వ్యావహారిక భాషతో పెంపొందింప జేయడానికి తన జీవితాన్ని వెచ్చించిన మహా రచయిత కొవ్వలి. తెలుగుజాతి ఉన్నంత మేరు, తెలుగుగాలి సోకినంత దూరం, తెలుగు అక్షరాలు నేర్చిన వారిలో కొవ్వలి రచనలు చదివి ఆనందించినవారు, అభినందించిన వారు లేరనడం అతిశయోక్తి కాదు. -కొవ్వలి లక్ష్మినరసింహారావు.