ఆధునిక రచయిత్రులలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిది ప్రత్యేక స్థానం. అనేక కథలు, నవలలు, నాటికలు స్త్రీల సమస్యలనే ప్రధానంగా తీసుకుని రచిస్తున్నారు. స్త్రీ అభివృద్ధి, అభ్యుదయ కాంక్ష వీరి రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కథా సంపుటాలు, నవలలు, నాటికలు పుస్తకాలుగా వెలువరించారు.
పరిస్థితులకు బలైపోయిన కాలేజీ అమ్మాయి, రాజీపడలేని వివాహబంధం, ఇష్టం లేకుండానే కొడుక్కి జన్మనివ్వడం, పసిబిడ్డని పల్లెటూళ్ళో అత్తవారింటి వద్ద వదిలేసి, గమ్యం వెతుక్కుంటూ ఒంటరిగా జనారణ్యంలోకి ప్రయాణం - ఈ నవలకి పునాది ఈ సంఘటనలు. తర్వాత ఏమైంది, అర్చన తన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుకుంది, ఎలాంటి నిర్ణయాలు ఆమెని ఏ ఏ దిశగా నడిపించాయి, ఈ కథకి ముగింపు ఏమిటి... లాంటి ప్రశ్నలకి సమాధానం నవలలోని దొరుకుతాయి.
ఒక మంచి నవలగా ఆసాంతం వదలకుండా చదివిస్తుంది. ఎంచుకున్న విషయం విలక్షణమైనది. నాయిక రోషం, పౌరుషం ఒకోసారి పాఠకులకు అర్థంలేనివిగా అనిపిస్తాయి. ఇంట పట్టుదల అవసరమా అనిపిస్తుంది. కన్నవారినీ, కట్టుకున్నవాడినీ, అత్తవారినీ ఎదిరించి ఒంటరిపోరాటం సాగిస్తున్న 'అర్చన' మీద చాలా వరకూ సానుభూతి కన్నా కోపమే కలుగుతుంది.
ఆధునిక రచయిత్రులలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిది ప్రత్యేక స్థానం. అనేక కథలు, నవలలు, నాటికలు స్త్రీల సమస్యలనే ప్రధానంగా తీసుకుని రచిస్తున్నారు. స్త్రీ అభివృద్ధి, అభ్యుదయ కాంక్ష వీరి రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కథా సంపుటాలు, నవలలు, నాటికలు పుస్తకాలుగా వెలువరించారు. పరిస్థితులకు బలైపోయిన కాలేజీ అమ్మాయి, రాజీపడలేని వివాహబంధం, ఇష్టం లేకుండానే కొడుక్కి జన్మనివ్వడం, పసిబిడ్డని పల్లెటూళ్ళో అత్తవారింటి వద్ద వదిలేసి, గమ్యం వెతుక్కుంటూ ఒంటరిగా జనారణ్యంలోకి ప్రయాణం - ఈ నవలకి పునాది ఈ సంఘటనలు. తర్వాత ఏమైంది, అర్చన తన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుకుంది, ఎలాంటి నిర్ణయాలు ఆమెని ఏ ఏ దిశగా నడిపించాయి, ఈ కథకి ముగింపు ఏమిటి... లాంటి ప్రశ్నలకి సమాధానం నవలలోని దొరుకుతాయి. ఒక మంచి నవలగా ఆసాంతం వదలకుండా చదివిస్తుంది. ఎంచుకున్న విషయం విలక్షణమైనది. నాయిక రోషం, పౌరుషం ఒకోసారి పాఠకులకు అర్థంలేనివిగా అనిపిస్తాయి. ఇంట పట్టుదల అవసరమా అనిపిస్తుంది. కన్నవారినీ, కట్టుకున్నవాడినీ, అత్తవారినీ ఎదిరించి ఒంటరిపోరాటం సాగిస్తున్న 'అర్చన' మీద చాలా వరకూ సానుభూతి కన్నా కోపమే కలుగుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.