సముద్రుడు అంటూ సముద్రాన్ని పురుషుడుతో పోల్చారు కవులు. కానీ స్త్రీ హృదయమే ఓ సాగర గర్భం.... అందులో ఆణిముత్యాలు, కఠిన శిలలు ఉన్నట్టే హాలాహలను ఉంటుంది. కొంచెం ప్రేమామృతం అందిస్తే ఆ శిలలు కరుగుతాయి. సముద్రాన్ని మరింత విస్తరింపచేస్తాయి. గరళాన్ని మింగమని శాసిస్తే! గొంతు దాటని ఆ గరళం ఉత్తుంగ తరంగమై, ఓ పెను తుపానై ఈ సమాజాన్ని ముంచేస్తుంది.... నామరూపాలు లేకుండా చేస్తుంది. సమాజం సజావుగా సాగాలంటే సాగరమధనం చేసినట్టే సాగర గర్భంలాంటి స్త్రీ హృదయాన్ని శోధించండి. హాలాహలాన్ని గుండెల్లో దాచుకుని, ప్రేమామృతాన్ని ప్రపంచానికి పంచుతుంది. సమస్త ప్రకృతినీ ప్రేమ మాయం చేస్తుంది.
- అత్తలూరి విజయలక్ష్మి