కోడి పుంజు ఎంతో అందమైనది. అనేక రంగుల్లో ఆకర్షనీయంగా ఉంటుంది.
మిగిలిన జాతుల పక్షులకు లేని విలక్షణ స్వభావం కోడిపుంజుది. ఎంతమాత్రం అంతకుముందు పరిచయం లేకపోయినా ఒకానొక వైరితత్వంతో పోరాడే గుణం వాటి రక్తంలోనే ఉంది. కోడిపుంజుల్లో ఉండే రోషాన్నీ పోరాటపటిమనీ సాంస్కృతిక విలాసంగా క్రీడావిన్యాసంగా జూదప్రక్రియగా మార్చుకున్నాడు మనిషి. చిన్నప్పట్నుంచీ సంక్రాంతి పండుగ రోజుల్లో కోడిపందాలు వినోదంగా మారడాన్ని గమనించాను. అలాగని నేనెప్పుడూ పందాల కోసం కోడిపుంజుల్ని పెంచడం, డబ్బులు పందెం ఒడ్డడం చేయలేదు.
గత నాలుగైదేళ్లుగా యానాంకు దగ్గర్లోని మురమళ్ల, ఎదుర్లంక, పల్లంకుర్రు గ్రామాలకు వెళ్లేవాడిని. ఆధునిక కోడిపందాల్లో ఉపయోగించే సాంకేతికత, చుట్టూ జరిగే జూదాలు చూసి తెలుగుసాహిత్యం పెద్దగా స్పృశించని దీన్ని కథలు రాయాలనుకున్నాను. పల్లెలకెళ్లి సమాచారం సేకరించాను. అనేకమందితో మాట్లాడాను. ఫోన్లు చేశాను. గూగులమ్మ తలుపు తట్టాను.
కోడి పుంజు ఎంతో అందమైనది. అనేక రంగుల్లో ఆకర్షనీయంగా ఉంటుంది. మిగిలిన జాతుల పక్షులకు లేని విలక్షణ స్వభావం కోడిపుంజుది. ఎంతమాత్రం అంతకుముందు పరిచయం లేకపోయినా ఒకానొక వైరితత్వంతో పోరాడే గుణం వాటి రక్తంలోనే ఉంది. కోడిపుంజుల్లో ఉండే రోషాన్నీ పోరాటపటిమనీ సాంస్కృతిక విలాసంగా క్రీడావిన్యాసంగా జూదప్రక్రియగా మార్చుకున్నాడు మనిషి. చిన్నప్పట్నుంచీ సంక్రాంతి పండుగ రోజుల్లో కోడిపందాలు వినోదంగా మారడాన్ని గమనించాను. అలాగని నేనెప్పుడూ పందాల కోసం కోడిపుంజుల్ని పెంచడం, డబ్బులు పందెం ఒడ్డడం చేయలేదు. గత నాలుగైదేళ్లుగా యానాంకు దగ్గర్లోని మురమళ్ల, ఎదుర్లంక, పల్లంకుర్రు గ్రామాలకు వెళ్లేవాడిని. ఆధునిక కోడిపందాల్లో ఉపయోగించే సాంకేతికత, చుట్టూ జరిగే జూదాలు చూసి తెలుగుసాహిత్యం పెద్దగా స్పృశించని దీన్ని కథలు రాయాలనుకున్నాను. పల్లెలకెళ్లి సమాచారం సేకరించాను. అనేకమందితో మాట్లాడాను. ఫోన్లు చేశాను. గూగులమ్మ తలుపు తట్టాను.© 2017,www.logili.com All Rights Reserved.