లేళ్ళ మెరక
వానంటే అసహ్యం... వానంటే వెగటు... వానంటే... కడుపులో సుడులు
తిరుగుతున్న గాభరా... దిక్కుమాలిన వాన... తోచనివ్వదు... తోచింది చెయ్యనివ్వదు...
ఇంకా కొంపలు మునిగినట్లు... ఉరుములు... మెరుపులు.
భయం... ఒకటే భయం. అర్జున... ఫల్గుణ... గుండెపై ఉమ్మి తుంపరలు.
తను తప్పు చేస్తున్నాడా? కొడుకు మాటల్లో నిజముందా?
వెంకటపతిరాజు ఆలోచిస్తున్నాడు. తెగని ఆలోచనలు దు:ఖానికి దగ్గర దారి... అయినా సరే... ఆలోచనల పరంపర.
మట్టిని నమ్ముకునే రోజులు పోయాయి. విశ్వాసాలు మట్టి కొట్టుకుపోతున్నాయి. మట్టిని ఒంటికి పూసుకోవడం... మట్టి... మట్టి... అంటూ కలవరించడం... అనవసరమేమో. మట్టి బంగారం అనుకున్నాడు ఒకనాడు. తరతరాల సేద్యం చేటు చేస్తుందనుకున్నపుడు కొనసాగించడం తప్పే అంటున్నాడు కొడుకు.
చేను వెంబడి తిరిగిన ప్రతిక్షణం అమృత ఘడియే. ఋతువుల భ్రమణం కొత్త ఉత్సాహమై వెలిగేది. దేశం కడుపు నింపే కార్యంలో తనొక గింజనని తలచాడు.
వ్యవసాయం లోని ప్రతిదశ తనకు నేర్పిందెవరు? వయసుతో బాటు అనుభవం కలిగింది. అనుభవాలు పెరిగేకొలది ఎదురుదెబ్బలు తట్టుకునే శక్తి అలవడింది.
విత్తనం జాగ్రత్త చేయడం... నారుపోసి ఆకుమడి సిద్ధం చేయడం... కన్నబిడ్డలా సాకి ఊడ్చి... కోత కోసి... పనలు మోపుకట్టి... నెత్తిన మోసి... కుప్పేసి... నూర్పులు సూరి... ఎగరబోసి... సంచులు నింపి... ఒక తొలకరి... మరొక దాళ్వాగా... విరామమెరుగని... ఉరుకులు... పరుగులు.................
లేళ్ళ మెరక వానంటే అసహ్యం... వానంటే వెగటు... వానంటే... కడుపులో సుడులు తిరుగుతున్న గాభరా... దిక్కుమాలిన వాన... తోచనివ్వదు... తోచింది చెయ్యనివ్వదు... ఇంకా కొంపలు మునిగినట్లు... ఉరుములు... మెరుపులు. భయం... ఒకటే భయం. అర్జున... ఫల్గుణ... గుండెపై ఉమ్మి తుంపరలు. తను తప్పు చేస్తున్నాడా? కొడుకు మాటల్లో నిజముందా? వెంకటపతిరాజు ఆలోచిస్తున్నాడు. తెగని ఆలోచనలు దు:ఖానికి దగ్గర దారి... అయినా సరే... ఆలోచనల పరంపర. మట్టిని నమ్ముకునే రోజులు పోయాయి. విశ్వాసాలు మట్టి కొట్టుకుపోతున్నాయి. మట్టిని ఒంటికి పూసుకోవడం... మట్టి... మట్టి... అంటూ కలవరించడం... అనవసరమేమో. మట్టి బంగారం అనుకున్నాడు ఒకనాడు. తరతరాల సేద్యం చేటు చేస్తుందనుకున్నపుడు కొనసాగించడం తప్పే అంటున్నాడు కొడుకు. చేను వెంబడి తిరిగిన ప్రతిక్షణం అమృత ఘడియే. ఋతువుల భ్రమణం కొత్త ఉత్సాహమై వెలిగేది. దేశం కడుపు నింపే కార్యంలో తనొక గింజనని తలచాడు. వ్యవసాయం లోని ప్రతిదశ తనకు నేర్పిందెవరు? వయసుతో బాటు అనుభవం కలిగింది. అనుభవాలు పెరిగేకొలది ఎదురుదెబ్బలు తట్టుకునే శక్తి అలవడింది. విత్తనం జాగ్రత్త చేయడం... నారుపోసి ఆకుమడి సిద్ధం చేయడం... కన్నబిడ్డలా సాకి ఊడ్చి... కోత కోసి... పనలు మోపుకట్టి... నెత్తిన మోసి... కుప్పేసి... నూర్పులు సూరి... ఎగరబోసి... సంచులు నింపి... ఒక తొలకరి... మరొక దాళ్వాగా... విరామమెరుగని... ఉరుకులు... పరుగులు.................© 2017,www.logili.com All Rights Reserved.