చైనా వారు పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా నగరాభివృద్ధి చేసారు. లక్ష్యం, సంకల్పం ఉంటె మన దేశ ప్రధాన నగరాలు కూడా ప్రపంచం లోని గొప్ప నగరాల స్థాయికి చేరగలవు.
ఈ పర్యాటన వల్ల ఖచ్చితంగా ఆ దేశం పట్ల నాకు గల కొన్ని అభిప్రాయాల్ని మార్చుకున్నాను. నా అవగాహన పరిధి పెరిగింది. చైనా అంటే ఒక ఉజ్వల భవిష్యత్తుకు చిరునామా. మానవ వనరుల్ని ఫలప్రదంగా ఉపయోగించుకునే చైతన్య జీవనాడి. కష్టించి పనిచేసే జీవన సరళి. నిర్విరామ కృషిలో తీర్చిన అభివృద్ధి బాటల వికాసం . కఠిన నిబంధనల క్రమ శిక్షణల నిరంతర పురోగమనం . పురా సంస్కృతుల తేజో పరిరక్షకుల ఖజానా.
చైనా లో నేను తిరిగిన దారులు, చుసిన చారిత్రక ప్రదేశాలు అనుభవాల గురించి రాయడానికి చేసిన చిరు ప్రయత్నం ఇది.