నా చిన్నతనం అనగానే వెంటనే గుర్తొచ్చేది కాకినాడ. కాకినాడ అనగానే మాకు ప్రాణం లేచోచ్చేసేది. మనసు రెక్కలు సాచి గాలిలో రివ్వున ఎగిరి పోయేది!
కాకినాడ మాకు ప్రాణం!
అక్కడే మేం పుట్టాం, ప్రతి సెలవులకి కాకినాడ పరిగెత్తేసేవాళ్ళం! రైలెక్కిన దగ్గర నుండి కాకినాడ చేరేవరకు ఒకటే ఆరాటం! ఆ గాలి తగలగానే చెప్పలేని సంభ్రమం, సంతోషం!
కాని... అదే కాకినాడకి ఇప్పుడు వెళ్ళడమే లేదు. ఎప్పుడో ఏ పెళ్ళిళ్ళకో, నిర్యాణాలకో! తప్పదంతే!
మూడు సంవత్సరాల క్రితం ఒక పెళ్ళికి వెళ్ళేను. కాస్త ఖాళీ దొరగ్గానే.. మేము చిన్నతనాన్ని గడిపిన చోటకి వెళ్ళాలని మా అన్నయ్యని కారడిగేను.
"ఏముందే అక్కడ? ఏం చూస్తావ్, నీ మొహం!" అన్నాడు. ఇప్పుడు వీళ్ళంతా సర్పవరం జంక్షన్ వైపు వచ్చి ఇళ్ళు కట్టుకున్నారు.
- మన్నెం శారద