ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న ఈ మహమ్మారి కరోనా వైరస్ విద్వాంసానికి చాలించి ఈ నవల రాశాను. ప్రతి మనిషి గుండెల్లో భయమనే బాకులతో పొడిచేస్తూ, కుంగుబాటుకు గురిచేసి, నిరాశా నిస్పృహల లోయల్లోకి గెంటేస్తోంది. ప్రపంచ దేశాల్ని గజగజ వణికిస్తూ చావు కేకలను వినిపిస్తూ మరణ మృదంగం వాయిస్తోంది ఏ మహమ్మారి కరోనా. ఈ విష జీవిని నియంత్రించేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుని లాక్ డౌన్ అమలు చేసింది మన దేశం. కాని ఈ లాక్ డౌన్ వలన ఎన్నో రంగాల్లో ఆర్థిక నష్టం వాటిల్లింది. పేదల ఆకలి కేకలు, వలస కూలీలా వెతలు, చిన్న వ్యాపారుల బాధలు నన్ను కుదిల్చివేశాయి. ప్రతి మనిషికి కష్టాలు కలిగించింది. పేద, ధనిక భేదం లేకుండా ఆర్థికంగా కుంగదీసింది. ప్రపంచం మొత్తం. .. ప్రాణ నష్టమే కాదు, ఆర్థిక కష్టనష్టాల్లో కురుకుపోయేట్లు చేసింది ఈ మహమ్మారి.
- శ్రీమతి పుప్పాల సూర్యకుమారి